రోడ్డు పైన కొంత మంది పచ్చ జెండాలు పట్టుకొని ర్యాలీ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేస్తూ, ట్యాంక్‌బండ్‌పై పాకిస్తానీ జండాలతో పాతబస్తీ మతోన్మాదులు ఊరేగుతున్నారు అని, BRS మళ్ళీ పదవిలోకి వస్తే హిందువులను కాపాడుకోలేము అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కధనం ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ట్యాంక్‌బండ్‌పై పాకిస్తానీ జెండాలతో ఊరేగింపు జరిగింది.
ఫాక్ట్(నిజం): ఈ ర్యాలీ మిలాద్-ఉన్-నబి సందర్బంగా ట్యాంక్‌బండ్ పైన చోటు చేసుకుంది. కానీ, ఇందులో యువకులు పట్టుకున్నవి పాకిస్థానీ జెండాలు కాదు, ఇవి మతపరమైన జండాలు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విదంగా ఉంది.
ఈ వీడియోలోని కీ ఫ్రేంలను ఉపయోగించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, హైదరాబాద్ డెక్కన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో ఇదే వీడియోను పోస్టు చేయటం గమనించాం. ఇది మిలాద్-ఉన్-నబి సందర్బంగా కొందరు ట్యాంక్‌బండ్ వద్ద బైక్‌పై ర్యాలీ చేపట్టిన సందర్బంలో తీసిన వీడియో.
దీని గురించి మరింత వెతకగా, ఈ పండగ రోజున హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఇటువంటి జెండాలను పట్టుకొని పోలీసుల ఆధ్వర్యంలో ఊరేగింపు చేసారు అని తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ జెండాల గురించి పరిశీలించగా, ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్‌పైన చోటు చేసుకున్నప్పటికీ, ఇందులో యువకులు పట్టుకున్నవి పాకిస్థానీ జెండాలు కాదు, అని ఇవి మతపరమైన జండాలని తెలుసుకున్నాం.
పాకిస్థాన్ జెండాకు, మిలాద్-ఉన్-నబి ఊరేగింపులో వాడిన మతపరమైన జండాకు తేడా కింద చూడవచ్చు. గతంలో కూడా ఇటువంటి క్లెయిమ్ లపై ఫాక్ట్‌లీ కథనాలను ప్రచురించింది. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
చివరిగా, ట్యాంక్‌బండ్‌పై మిలాద్ ఉన్ నబి ర్యాలీలో పట్టుకున్న మతపరమైన జెండాలను, పాకిస్థాన్ జెండాలు అంటూ షేర్ చేస్తున్నారు.