Fake News, Telugu
 

స్క్రిప్టెడ్ వీడియోలను వాస్తవ ఘటనలుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

0

అప్డేట్ (31ఆగస్ట్ 2023):

హిందూ మహిళ చీర బైక్ టైర్లలో చిక్కుకుపోతే ఒక ముస్లిం మహిళ తన బురఖాను ఆమెకిచ్చి సహాయం చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. హిజాబ్ గురించి తప్పుడు కూతలు కూసిన వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండంటూ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ మహిళ చీర బైక్ టైర్లలో చిక్కుకున్నప్పడు ఒక ముస్లిం మహిళ తన బురఖాను ఆమెకిచ్చి సహాయం చేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోని కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు.  కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘3RD EYE’ యూట్యూబ్ ఛానెల్ 23 ఆగస్టు 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో చూపించిన వివరణలో ఈ వీడియోని కేవలం వినోదం, ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు. ‘3RD EYE’ పబ్లిష్ చేసిన అనేక స్క్రిప్టెడ్ వీడియోలకు సంబంధించి ఫాక్ట్‌లీ ఇదివరకు పబ్లిష్ చేసియం ఆర్టికల్స్‌ను ఇక్కడ చూడవచ్చు.

అప్డేట్ (19 జులై 2023):

వరంగల్‌లోని ఒక లేడీస్ హాస్టల్‌లో ఆడపిల్లలకు డబ్బు ఆశగా చూపించి వారితో వ్యభిచారం చేయిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతుంది. డబ్బుకి ఆశపడి అమ్మాయిలు తమ జీవితాలను ఆగం చేసుకోవద్దని, ఈ ఘటన వరంగల్‌లో నిజంగా చోటుచేసుకుందని ఒక మహిళ ఈ వీడియో క్లిప్పుని షేర్ చేస్తూ తెలిపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

క్లెయిమ్: వరంగల్‌లోని ఒక లేడీస్ హాస్టల్‌లో ఆడపిల్లలకు డబ్బు ఆశగా చూపించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారంటూ షేర్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్ట్‌డ్ వీడియో. ఈ వీడియో వాస్తవికంగా జరిగిన ఘటనను చూపించడం లేదు. అలాగే, ఈ వీడియోతో వరంగల్‌కు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి, కొన్ని కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 3RD EYE అనే యూట్యూబ్ ఛానెల్ 22 April 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అమ్మాయిలు కాలేజీ గోడను దూకి బయటికి వెళుతున్న దృశ్యాలంటూ ఈ వీడియోని పబ్లిష్ చేశారు. అయితే, ఈ వీడియో వాస్తవ ఘటనను చూపించడం లేదని, అవగాహన కోసం ఆ వీడియోని చిత్రీకరించినట్లు వివరణలో స్పష్టంగా పేర్కొన్నారు. పై వివారాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో వరంగల్‌లో జరిగిన ఎటువంటి వాస్తవ ఘటనను చూపించడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అప్డేట్ (18 మే 2022):

ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల వెంట పడి మత్తు పదార్థాల అలవాటు చేసి ప్రేమించేలచేసి ఆ తరువాత మతం మార్చి జిగాదీలుగా తయారు చేస్తున్నారు“, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల వెంట పడి, వారికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది వాస్తవంగా జరిగిన ఘటన కాదు. అది ఒక స్క్రిప్టెడ్ వీడియో. పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియోకి సంబంధించిన ఎక్కువ నిడివి గల వెర్షన్‌ని నటి పూనమ్ బజ్వా పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియో చివర్లో అది వాస్తవ ఘటన కాదని, అవగాహన కోసం ఆ వీడియోని చిత్రీకరించినట్లు స్పష్టంగా ఒక వివరణ ఉంది. ఆ పోస్ట్‌లో కూడా తను ఇదే విషయాన్ని రాసింది. అదే రూమ్‌లో చిత్రీకరించిన ఇతర స్క్రిప్టెడ్ వీడియోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

అప్డేట్ (09 మే 2022):

రోడ్డుపై ఫిట్స్ వచ్చి పడిపోయిన హిందూ వ్యక్తిని ఒక ముస్లిం జంట కాపాడినట్టు చెప్తూ, ఒక వీడియోని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “ఇదే ఇస్లాం నేర్పే ప్రేమ అభిమానం ఇదే మన ప్రవక్త”, అని రాస్తూ అదొక వాస్తవ ఘటనగా చూపిస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రోడ్డుపై ఫిట్స్ వచ్చి పడిపోయిన హిందూ వ్యక్తిని ఒక ముస్లిం జంట కాపాడుతున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక స్క్రిప్టెడ్ వీడియో. అది వాస్తవంగా జరిగిన ఘటన కాదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియోకి సంబంధించిన ఎక్కువ నిడివి గల వెర్షన్‌ని నటి ప్రియ పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియో చివర్లో అది వాస్తవ ఘటన కాదని, అవగాహన కోసం ఆ వీడియోని చిత్రీకరించినట్లు స్పష్టంగా ఒక వివరణ ఉంది. ఆ పోస్ట్‌లో కూడా తను ఇదే విషయాన్ని రాసింది. అంతేకాదు, స్క్రిప్టెడ్ వీడియోలను పెట్టే ‘3RD EYE’ యూట్యూబ్ చానెల్‌లో కూడా పోస్ట్‌లోని వీడియోని (వేరే తేదీతో) చూడవచ్చు. 

అప్డేట్ (06 మే 2022):

కరెంట్ స్తంభంపై ప్రమాదవశాత్తు పడి, షాక్ తగులుతున్న ఒక వ్యక్తిని కొందరు ముస్లిం మహిళలు కాపాడినట్టు చెప్తూ, ఒక వీడియోని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “ఇలాంటి సమయంలో మతాలు పక్కనపెట్టి మానవత్వం పరిమలించే మంచి మనుషులకు స్వాగతం సుస్వాగతం”, అని రాస్తూ అదొక వాస్తవ ఘటనగా చూపిస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కరెంట్ షాక్ తగులుతున్న ఒక వ్యక్తిని కొందరు ముస్లిం మహిళలు కాపాడుతున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్ చేసిన వీడియోలో జరిగింది వాస్తవ ఘటన కాదు. అది ఒక స్క్రిప్టెడ్ వీడియో. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియోకి  సంబంధించిన ఎక్కువ నిడివి ఉన్న వెర్షన్‌ని వేరే ఒకరు పోస్ట్  చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియో చివర్లో అది వాస్తవ ఘటన కాదని, అవగాహన కోసం ఆ వీడియోని చిత్రీకరించినట్లు స్పష్టంగా ఒక వివరణ ఉంది. అంతేకాదు, అవే డ్రెస్సులు మరియు గొడుగు ఉన్న మరో వీడియోని స్క్రిప్టెడ్ వీడియోలను పెట్టే ‘3RD EYE’ యూట్యూబ్ ఛానల్‌లో చూడవచ్చు. 

అప్డేట్ (22 మార్చి 2022):

ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తూ, ఆ వీడియోలో జరిగిన ఘటన వాస్తవంగా జరిగినట్టు షేర్ చేస్తున్నారు. అమ్మాయిని అబ్బాయిలు ఏడిపిస్తున్న సమయంలో మరో వ్యక్తి వచ్చి తనని వారి నుండి కాపాడినట్టు వీడియోలో చూడవచ్చు.

క్లెయిమ్: ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఆ వీడియోలో జరిగింది వాస్తవ ఘటన కాదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

అయితే, ఆ వీడియోలోనిది నిజంగా జరిగిన ఘటన కాదు. పోస్ట్‌లోని వీడియోని సరిగ్గా గమనిస్తే, అది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని 16 సెకండ్ల దగ్గర ఒక వివరణ వచ్చినట్టు చూడవచ్చు. అంతేకాదు, వీడియోలో ఎర్ర రంగు టీ-షర్టు వేసుకున్న వ్యక్తి పేరు నవీన్ జాంగ్ర. తను అలాంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలను తన ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. కాబట్టి, పోస్ట్‌లోని వీడియోలో ఉన్న దృశ్యాలు వాస్తవ ఘటనకు సంబంధించినవి కావు.

అప్డేట్ (08 మార్చి 2022):

అన్యమత స్త్రీ ఆత్మగౌరవం కోసం తన సంప్రదాయం ని త్యాగం చేసిన నా భారతీయ ముస్లిం సోదరికి శత కోటివందనాలు. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళుతున్న సమయంలో ఆమెకి నెలసరి వస్తుంది…..ఆమె ఏడ్చు కుంటూ ఒక స్క్యూటర్ మీద కూర్చుంది. కొంత సేపటికి ఒక బురఖా ధరించిన ముస్లిం స్త్రీ అటుగా వెళ్తూ ఈ సంఘటన చూసి తన తన బురఖా ఆ అమ్మయి కి ఇచ్చి ఆ అమ్మయి ఆత్మాభిమానం ని కాపాడింది”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రోడ్డుపై నెలసరి వచ్చిన మహిళకు బుర్కా ధరించిన మరో మహిళ సహాయం చేస్తున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఆ వీడియోలో జరిగింది వాస్తవ ఘటన కాదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో ఉన్న వీడియోలో దిగువ భాగంలో ‘COPYRIGHT BY 3RD EYE’ అని రాసి ఉన్నట్టు గమనించవచ్చు. అదే వీడియో యొక్క ఎక్కువ నిడివి ఉన్న వెర్షన్ ‘3RD EYE’ యూట్యూబ్ చానెల్‌లో చూడవచ్చు. టైటిల్‌లో ఆ వీడియోని సామాజిక అవగాహన కోసం తీసినట్టు రాసారు. అంతేకాదు, వీడియో చివర్లో కూడా అది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్లు స్పష్టంగా ఒక వివరణ కూడా ఉంది. ‘3RD EYE’ యూట్యూబ్ చానెల్‌లో అలాంటి మరిన్ని స్క్రిప్టెడ్ వీడియోలు చూడవచ్చు.

ఇంతకముందు కూడా ఇలాంటి కొన్ని వీడియోలు వాస్తవ ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, అవి కూడా స్క్రిప్టెడ్ వీడియోలని చెప్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ని కింద లిస్టులో చదవచ్చు.

చివరగా, స్క్రిప్టెడ్ వీడియోలను వాస్తవ ఘటనలుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll