Fake News, Telugu
 

బంగ్లాదేశ్ బాలుడు జింక పిల్లను కాపాడిన ఫోటోలని షేర్ చేస్తూ అస్సాం బాహుబలిగా వర్ణిస్తున్నారు

0

నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడిన అస్సాం బాలుడి ఫోటోలు, అంటూ షేర్ చేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను ప్రాణాలను తెగించి కాపాడిన అస్సాం బాలుడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో చూపిస్తున్న బాలుడు బంగ్లాదేశ్ కి చెందిన బెలాల్ అని విశ్లేషణలో తెలిసింది. బంగ్లాదేశ్ లోని నోకలి జిల్లా వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక జింక పిల్లను, బెలాల్ అనే బాలుడు కాపాడినప్పుడు తీసిన ఫోటో అది. ఈ బాలుడు భారత దేశానికి చెందిన అతను కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ‘Daily Mail’ న్యూస్ వెబ్సైటు వారు ‘6 Feb 2014’ నాడు ప్రచురించిన ఒక ఆర్టికల్ లో ఈ ఫోటోలకు సంబంధించిన వివరాలు దొరికాయి. పోస్టులో షేర్ చేసిన ఫోటోలు బంగ్లాదేశ్ లోని  నోకలి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించినవి అని ఆ ఆర్టికల్ లో తెలిపారు. బంగ్లాదేశ్ లోని నోకలి జిల్లాలో వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక జింక పిల్లను, బెలాల్ అనే బాలుడు ప్రాణాలను తెగించి కాపాడినట్టు ఆ ఆర్టికల్ లో రాసారు. హసిబుల్ వహాబ్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఫోటో ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు ఈ ఫోటోలను తీసినట్టు ఆ ఆర్టికల్ లో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘The Huffington Post’ వారు రాసిన ఆర్టికల్ దొరికింది. ఈ ఆర్టికల్ లో కూడా ఫోటోలో కనిపిస్తున్నది బంగ్లాదేశ్ కి చెందిన బాలుడు అని తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా మరింత సమాచారం కోసం వెతకగా, ఈ సంఘటనకి సంబంధించిన మరికొన్ని ఫోటోలు బంగ్లాదేశ్ కి చెందిన బ్లాగ్ లో మరియు ఫేస్బుక్ పేజిలో దొరికాయి.

చివరగా, బంగ్లాదేశ్ కి చెందిన బాలుడి పాత ఫోటోలని చూపిస్తూ అస్సాం బాహుబలిగా వర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll