Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘కోవిడ్ మెడికల్ కిట్’ అని సూచిస్తూ టాటా గ్రూప్ ఈ అడ్వైజరీని జారీ చేయలేదు

0

‘టాటా గ్రూప్ అడ్వైజరీ సూచించిన కోవిడ్ మెడికల్ కిట్’ అనే టైటిల్ తో ఉన్న ఒక మెసేజ్ సోషల్ మీడియా లో చలామణీ అవుతోంది. మెసేజ్ లో ఆ మెడికల్ కిట్ యొక్క వివరాలు మరియు కోవిడ్-19 యొక్క మూడు దశల గురించి వివరణ ఉంది. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘కోవిడ్ మెడికల్ కిట్’ అని సూచిస్తూ టాటా గ్రూప్ జారీ చేసిన అడ్వైజరీ.

ఫాక్ట్ (నిజం): టాటా గ్రూప్ వారు పోస్టులోని వివరాలతో ఉన్న ‘కోవిడ్-19 మెడికల్ కిట్’ ని జారీ చేయలేదని స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

మెసేజ్ గురించి స్పష్టత కోసం ట్విట్టర్ లో ఒక వ్యక్తి టాటా గ్రూప్ వారి ‘టాటా హెల్త్’ విభాగాన్ని టాగ్ చేసినప్పుడు, ‘టాటా హెల్త్’ వారు తమ సంస్థ అటువంటి  అడ్వైజరీ జారీ చేయలేదని తెలిపింది.

‘టాటా హెల్త్’ మరొక ట్వీట్ లో తమ సంస్థ పేరుతో సోషల్ మీడియా లో చలామణీ అవుతోన్న మెసేజ్ లను నమ్మవద్దని , కోవిడ్-19 కి సంబంధించిన సమాచారం మరియు సలహాల కోసం డాక్టర్ ని సంప్రదించాలని తెలిపింది.

అంతేకాదు, మెసేజ్ లో వివరించిన కోవిడ్-19 దశల గురించి సమాచారం కోసం వెతికినప్పుడు, ఏ ప్రఖ్యాత సంస్థ గానీ లేదా ఇన్స్టిట్యూట్ గానీ మెసేజ్ లో పేర్కొన్న కోవిడ్-19 దశల వర్గీకరణ చేయలేదని తెలిసింది. అయితే, రోగులలో కోవిడ్-19 వ్యాధి పురోగతి యొక్క మూడు విభిన్న దశలను ఇటీవల శాస్త్రవేత్తలు వివరించినట్లు తెలిసింది. ఆ సమాచారాన్ని కింద చూడవచ్చు –

  • దశ -1 (ఇన్ఫెక్షన్ దశ): వైరస్ శరీరం లోపల పెరుగుతుంది మరియు సాధారణ జలుబు లేదా ఫ్లూతో గందరగోళం చెందే తేలికపాటి లక్షణాలను కలిగిస్తుంది.
  • దశ -2 (పల్మనరీ దశ): రోగనిరోధక వ్యవస్థ సంక్రమణ ద్వారా బలంగా ప్రభావితమవుతుంది మరియు ప్రధానంగా శ్వాసకోశ లక్షణాలైన నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం మరియు తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు దారి తీస్తుంది.
  • దశ -3 (హైపెరిన్ఫ్లమేటరీ దశ): ఈ దశలో హైపర్యాక్టివేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ గుండెకి, మూత్రపిండాలకి మరియు ఇతర అవయవాలకి గాయం కలిగిస్తుంది.

వేడిగా నీరు లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే కోవిడ్-19 తగ్గిపోతుందనే మెసేజ్ లు సోషల్ మీడియా లో వైరల్ అయినప్పుడు ‘FACTLY’ రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, ‘కోవిడ్ మెడికల్ కిట్’ అని సూచిస్తూ టాటా గ్రూప్ ఈ అడ్వైజరీని జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll