Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వేడిగా నీరు, పాలు, టీ తాగితే లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే కోవిడ్-19 తగ్గిపోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

చైనాలోని వుహాన్ కి చెందిన ఒక వస్త్రవ్యాపారి పంపిన మెసేజ్ అని చెప్తూ, రోజుకు నాలుగు సార్లు వేడిగా నీరు, పాలు, టీ తాగితే లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే కోవిడ్-19 వ్యాధి తగ్గిపోతుందని, అలా చేసినందు వల్లే ఇప్పుడు చైనా లో ఒక్క కోవిడ్-19 మరణం కూడా లేదని, ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: రోజుకు నాలుగు సార్లు వేడిగా నీరు, పాలు, టీ తాగితే లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే కోవిడ్-19 వ్యాధి తగ్గిపోతుంది.

ఫాక్ట్ (నిజం): రోజుకు నాలుగు సార్లు వేడిగా నీరు, పాలు, టీ తాగితే లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే కోవిడ్-19 వ్యాధి తగ్గిపోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ప్రస్తుతానికి కోవిడ్-19 కి ఎటువంటి మందు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి వెబ్సైటులో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

రోజుకి నాలుగు సార్లు వేడిగా నీరు, పాలు, టీ తాగితే లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే తాగుతే కోవిడ్-19 వ్యాధి తగ్గిపోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావించలేదు.

నీరు:
కొరోనా వైరస్ ను నిరోధించడానికి ప్రతి 15 నిమిషాలకోసారి మంచినీళ్లు తాగాలని మరియు వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా తోలిగిపోతుందని చెప్తూ, ఇంతకముందు కూడా ఇలాంటి పోస్టులే వైరల్ అయినప్పుడు, వాటిల్లో చెప్పింది తప్పు అని FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.  

టీ:
వేడి టీ తాగుతే కూడా కొరోనా తగ్గుతుందని చెప్పాడనికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాదు, టీ లో మిథైల్క్సాంథైన్, థియోబ్రోమైన్ మరియు థియోఫిలిన్ రసాయనాలు ఉంటాయని, కావున రోజుకి మూడు సార్లు తాగటం వల్ల కొరోనాని నివారించవచ్చని ఒక మెసేజ్ వైరల్ అయినప్పుడు, అది తప్పు అని చెప్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు.

ఆవిరి:
మరుగుతున్న నీటి అవిరిని పీల్చినట్లయితే, అది కొరోనా వైరస్ ని శత శాతం చంపి వేస్తుందని ఒక మెసేజ్ ఇంతకముందు వైరల్ అయినప్పుడు, అది తప్పు అని చెప్తూ FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, వేడి నీరు, పాలు, టీ తాగితే లేదా వేడి నీటి ఆవిరి తీసుకుంటే కోవిడ్-19 తగ్గిపోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రస్తుతానికి కోవిడ్-19 కి ఎటువంటి మందు లేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll