Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా వైరస్ తొలగిపోదు

0

కోరోనా వైరస్ కి సంబంధించిన మెసేజ్ ఒకటి ఫేస్బుక్ లో చాలా షేర్ అవుతోంది. ఆ మెసేజ్ ఈ విధంగా ఉంది- ‘కరోనా వైరస్ ఊపిరితిత్తులకు చేరేముందు అది నాలుగు రోజులు గొంతులోనే ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తికి దగ్గు మరియు గొంతు నొప్పులు మొదలవుతుంది. అతను నీరు చాలా తాగి, వెచ్చని నీరు మరియు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే వైరస్ తొలగిపోతుంది’. ఆ మెసేజ్ లో చెప్పింది ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా వైరస్ తొలగిపోతుంది.

ఫాక్ట్ (నిజం): వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా వైరస్ తొలగిపోతుందని WHO వారు కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా పేర్కొనలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా తెలిపారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా వైరస్ తొలగిపోతుందా అని వెతికినప్పుడు, దానిని ధృవీకరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గానీ, భారత ప్రభుత్వం గానీ ఏమీ పేర్కొనలేదని తెలుస్తుంది. ఇంతకుముందు,ఇలాంటి విషయమే (‘గోరు వెచ్చటి నీరు మరియు ఉప్పుతో పుక్కులించడం వలన కోవిడ్-19 ని నివారించవచ్చు’ అనే మెసేజ్) చలామణీ అయినప్పుడు, దానిని ధృవీకరించడానికి తమ దగ్గర ఎటువంటి కచ్చితమైన సాక్ష్యాలు లేవని ‘AFP’ కి పంపించిన మెయిల్ లో WHO వారు తెలిపారు.

WHO ప్రకారం ఇప్పటివరకు COVID-19 చికిత్సకి ఎటువంటి వాక్సిన్ లేదు. ఇటివలే ఒక కంపెనీ రూపొందించిన వాక్సిన్ (mRNA-1273) ని అమెరికా లో పరీక్షిస్తున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడిసిన్ (NIH) వారి వెబ్సైటు ద్వారా తెలిసింది. కానీ, దాని ఫలితం తెలియడానికి ఇంకా చాలా సమయం పడ్తుంది. ‘PIB Factcheck’ వారు కూడా వైరల్ అవుతున్న ఆ మెసేజ్ లో ఉన్న విషయం తప్పని తెలిపినట్లుగా ఇక్కడ చూడవచ్చు. PIB కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ.

కొరోనా వైరస్ రాకుండా ఉండడానికి తీస్కోవలసిన ప్రాథమిక రక్షణ చర్యల గురించి WHO వారి వెబ్సైటు లో ఉన్న సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా వైరస్ తొలగిపోతుందనడానికి సాక్షాలు లేవు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll