Fake News, Telugu
 

ఈ ఫోటో లో ఉన్న ఖడ్గం మహారాణా ప్రతాప్ ది కాదు

0

ఒక ఖడ్గం ఫోటోను సోషల్ మీడియా లో పెట్టి అది ఒకప్పుడు భారత దేశాన్ని పాలించిన మహారాణా ప్రతాప్  యొక్క ఖడ్గం అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారత దేశాన్ని పాలించిన మహారాణా ప్రతాప్ వాడిన ఖడ్గం ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్న ఖడ్గం భారత దేశాన్ని పాలించిన మహారాణా ప్రతాప్ ది కాదు. అది ఎమిరేట్ ఆఫ్ గ్రెనడా యొక్క చివరి నస్రిద్ పాలకుడు బోబ్డిల్ (ముహమ్మద్ XII అని కూడా పిలుస్తారు) యొక్క ఖడ్గం. కావున, పోస్టులోని క్లెయిమ్ తప్పు.

పోస్ట్ లోని ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే అదే ఫోటో ‘ఇస్లామిక్ హిస్టరీ’ అనే వర్డ్ ప్రెస్ ఆర్టికల్ లో కనిపించింది. అందులో ఆ ఫోటో కింద ఉన్న వివరణ లో ఆ ఖడ్గం ఎమిరేట్ ఆఫ్ గ్రెనడా యొక్క చివరి నస్రిద్ పాలకుడు బోబ్డిల్ (ముహమ్మద్ XII అని కూడా పిలుస్తారు) కు చెందినది అని ఉంది. ఆ ఖడ్గం కి సంబంధించిన అదే విషయాన్ని ‘Sword-site’ అనే వెబ్సైట్ (చారిత్రాత్మిక ప్రాధాన్యత కలిగిన ఖడ్గాల జాబితా ఆ వెబ్సైట్ లో ఉంటుంది) లో కూడా చూడవచ్చు. ఆ ఫోటోలో ఉన్నది బోబ్డిల్ కి సంబంధించిన ఖడ్గం అని తెలిపే మరిన్ని సెర్చ్ రిజల్ట్స్ ని ఇక్కడఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

‘The Economic Times’ ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ రెండు ఖడ్గములు మోసేవాడని, వాటి బరువు దాదాపు 25 కిలోలు అని ఉంది. ఆయన తను పోరాడే  ముందు తన శత్రువు దగ్గర ఆయుధం లేకపోతే తన దగ్గర ఉన్న ఒక ఖడ్గం ఇచ్చేవాడు అని రాసారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మహారాణా ప్రతాప్ మ్యూజియంలో ప్రదర్శన కోసం పెట్టిన మహారాణా ప్రతాప్ యొక్క ఖడ్గములను గమనిస్తే, అతను ఉపయోగించిన ఖడ్గం అంచుల వద్ద వంగి ఉన్నట్టు తెలుస్తుంది. కానీ, పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న ఖడ్గం మాత్రం సూటిగా ఉంది.

చివరగా, ఫోటో లో ఉన్న ఖడ్గం భారత దేశాన్ని పాలించిన మహారాణా ప్రతాప్ ది కాదు.  అది ఎమిరేట్ ఆఫ్ గ్రెనడా యొక్క చివరి నస్రిద్ పాలకుడు బోబ్డిల్ (ముహమ్మద్ XII అని కూడా పిలుస్తారు) కు చెందినది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll