Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆవిరి పీలుస్తే కొరోనా వైరస్ చనిపోతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు

0

చైనీస్ నిపుణుడి హామీ. మరుగుతున్న నీటి అవిరిని పీల్చినట్లయితే, అది కరోన వైరస్ ని శత శాతం చంపి వేస్తుందని ప్రకటించారు. ఒక వేళ వైరస్ ముక్కుని, గొంతుని, ఊపిరితిత్తులని ఆక్రమించినా కూడా దానిని వేడి నీటి ఆవిరి నాశనం చేస్తుందని చెప్పారు. ప్రతి రోజు పలుసార్లు ఆ రకంగా చేయాలన్నారు. వేడినీటి ఆవిరి దెబ్బకు కరోన వైరస్ తట్టుకోలేదని అన్నారు’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. మరికొంత మంది ఆవిరి పీలుస్తూ, దాని వల్ల కొరోనా చనిపోతుందని మరియు వ్యాపించకుండా ఉంటుందని చెప్తున్న వీడియోలు [వీడియో1 (ఆర్కైవ్డ్), వీడియో 2 (ఆర్కైవ్డ్), వీడియో 3 (ఆర్కైవ్డ్), మరియు వీడియో 4 (ఆర్కైవ్డ్)] సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మరుగుతున్న నీటి అవిరిని పీల్చినట్లయితే, అది కొరోనా వైరస్ ని చంపేస్తుంది.

ఫాక్ట్ (నిజం): జలుబు చేసినప్పుడు ఆవిరి పీలుస్తే కొన్ని సమయాల్లో కొంత తాత్కాలిక ఉపశమనాన్ని పొందవొచ్చు, కానీ కొరోనా వైరస్ చనిపోతుందని చెప్పడనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అది ఒక ‘ఫేక్’ మెసేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

మరుగుతున్న నీటి ఆవిరిని పీల్చినట్లయితే కొరోనా వైరస్ చనిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కానీ, భారతప్రభుత్వం కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. జలుబు చేసినప్పుడు ఆవిరి పీలుస్తే కొన్ని సమయాల్లో  కొంత తాత్కాలిక ఉపశమనాన్ని పొందవొచ్చని కొన్ని హెల్త్ వెబ్సైటుల్లో చదవొచ్చు, కానీ కొరోనా వైరస్ చనిపోతుందని చెప్పడనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

అంతేకాదు, ఆవిరిని పీల్చినట్లయితే కొరోనా వైరస్ చనిపోతుందనే మెసేజ్ వైరల్ అవ్వడంతో, అది ఒక ‘ఫేక్’ మెసేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు కూడా ట్వీట్ చేసారు.

పోస్ట్ చేసిన వీడియోలో ‘వెచ్చని నీరు ఉప్పు లేదా వెనిగర్ తో పుక్కిలిస్తే కొరోనా వైరస్ తొలగిపోతుంది’ అని కూడా అంటున్నారు. అది కూడా తప్పే అని FACTLY ఇంతకు ముందే ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ రాసింది. దానిని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఆవిరి పీలుస్తే కొరోనా వైరస్ చనిపోతుందని చెప్పడనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll