Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

మంచి నీరు తరచుగా తాగడం మంచిదే కానీ కొరోనా వైరస్ కి అది నివారణ కాదు

0

‘తరచుగా నీళ్లు తాగితే…కరోనా దరి చేరదు!’ అనే టైటిల్ తో ఉన్న న్యూస్ క్లిప్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ న్యూస్ క్లిప్ లో ఒక డాక్టర్ ఈ విధంగా చెప్పినట్లుగా ఉంది-

కరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం తేలిక, ప్రతి రోజు ఉదయం లేవగానే సెల్ఫ్ చెకప్ చేసుకోవాలి… డీప్ గా బ్రీత్ తీసుకోవాలి. 10 సెకన్ల పాటు ఊపిరి బిగ పట్టాలి.మీకు గనక దగ్గు, అసౌకర్యంగట్టిగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే మీ ఊపిరితిత్తులకు ఫైబ్రోసిస్ వచ్చినట్టే. ఇది ఇన్ఫెక్షన్ వచ్చినట్టు సూచిక. క్రిటికల్ సమయాల్లో స్వచ్చమైన వాతావరణంలో మీరు సెల్స్ చెకప్ చేసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకోసారి కొన్ని గుటకల మంచినీళ్లు తాగాలి. దీనివల్ల గొంతు, నోరు ఎండిపోదు. మంచినీళ్లు లేని పక్షంలో ఇతర పానీయాలు తీసుకోవాలి.ఇలా తీసుకోవడం వల్ల గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి జారిపోతుంది. అయితే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆసిడ్స్ వైరస్ ను చంపేస్తాయి. మీరు గనక నీళ్లను సేవించకపోతే వైరస్ కాస్త శ్వాస నాళాలలోకి చేరిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ విషయాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు చేరవేయండి. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉంటేనే కరోనా వైరస్ ను అంతం చేయడానికి వీలుంటుంది.

ఆ న్యూస్ క్లిప్ లో ఉన్నది ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ 1: కొరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని సెల్ఫ్ చెకప్ చేసుకుని నిర్ధారించుకోవచ్చు.

ఫాక్ట్ (నిజం): పోస్టు లో చెప్పిన బ్రీత్ టెస్ట్ ద్వారా కొరోనా వైరస్ సోకిందో, లేదో అనే విషయాన్ని సెల్ఫ్ చెకప్ చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు గానీ, భారత ప్రభుత్వం గానీ ఎక్కడా కూడా పేర్కొనలేదు. బ్రీత్ టెస్ట్ ద్వారా కొరోనా వైరస్ సోకిందో లేదో చెప్పలేమని కొందరు డాక్టర్లు కూడా తెలిపారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టు లో చెప్పిన బ్రీత్ టెస్ట్ ద్వారా కొరోనా వైరస్ వైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని సెల్ఫ్ చెకప్ చేసుకోవచ్చా అని వెతికినప్పుడు, దానిని ధృవీకరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గానీ, భారత ప్రభుత్వం గానీ ఏమీ పేర్కొనలేదని తెలుస్తుంది. అయితే, ‘యూనివర్సిటీ అఫ్ మేరీల్యాండ్’ చీఫ్ అఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజేస్ ఫహీం యోనుస్ ఒక ట్వీట్ లో అది తప్పని తెలిపారు. అంతే కాదు, ‘Associated Press’ వారి కథనం ద్వారా కూడా పోస్టు లో చెప్పిన బ్రీత్ టెస్ట్ ద్వారా కరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయాన్ని నిర్దారించలేము అని తెలిసింది. ఆ కథనం లో బ్రీత్ టెస్ట్ ద్వారా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారిని గుర్తించవచ్చని, కానీ COVID-19 వచ్చినవారిని గానీ, ఆ వ్యాధి లక్షణాలతో ఉన్న వారిని గానీ గుర్తించలేమని వైద్య నిపుణులు చెప్పినట్లుగా ఉంది.

క్లెయిమ్ 2: ప్రతి 15 నిమిషాలకోసారి మంచినీళ్లు తాగాలి. దీనివల్ల గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి జారిపోతుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆసిడ్స్ వైరస్ ను చంపేస్తాయి.

ఫాక్ట్ (నిజం): తరుచుగా మంచినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ అది కొరోనా వైరస్ ను నిరోధించదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఫిలిప్పీన్స్ (WHO Philippines) వారు తెలిపారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పినట్లుగా మంచినీరు తరుచుగా తాగడం వల్ల కొరోనా వైరస్ ను నిరోధించవచ్చా అని వెతికినప్పుడు, ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఫిలిప్పీన్స్ (WHO Philippines) వారి ట్వీట్ లభించింది. అందులో వారు, తరుచుగా మంచినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ, అది కొరోనా వైరస్ ను నిరోధించదు అని తెలిపారు.

కొరోనా వైరస్ రాకుండా ఉండడానికి తీస్కోవలసిన ప్రాథమిక రక్షణ చర్యల గురించి WHO వారి వెబ్సైటు లో ఉన్న సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘బ్రీత్ టెస్ట్’ తో కొరోనా వైరస్ సోకిందా? లేదా? అనే విషయం నిర్దారించలేము. మంచి నీరు తరచుగా తాగడం ద్వారా కొరోనా వైరస్ ని నిరోధించలేము.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll