Coronavirus Telugu, Fake News, Telugu
 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ‘Maa Ahilya COVID Care Centre’ ని RSS నిర్మించలేదు

0

మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో దేశంలోనే 2వ అతి పెద్ద కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నిర్మించిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. 45 ఎకరాల్లో 6 వేల పడకలు, 4 ఆక్సిజన్ ప్లాంట్స్ తో ఈ కోవిడ్ సెంటర్ ని RSS నిర్మించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో దేశంలోనే 2వ అతి పెద్ద కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని RSS నిర్మించింది.

ఫాక్ట్ (నిజం): మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘Maa Ahilya COVID Care Centre’ ని ఇండోర్ లోని ‘Radha Soami Satsang Beas’ (RSSB) ఆధ్యాత్మిక సంస్థ స్థలంలో నిర్మించారు. RSSB సంస్థకు రాజకీయ పార్టీలతో గాని, ఇతర వాణిజ్య పరమైన సంస్థలతో ఎటువంటి సంబంధం లేదు. ఇండోర్ లోని ఈ కోవిడ్ క్వారంటైన్ కేంద్రంలో RSS కార్యకర్తలు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించడానికి పలు వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థలు విరాళాలు ఇచ్చినట్టు న్యూస్ వెబ్ సైట్స్ రిపోర్ట్ చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ నగరంలోని ‘Radha Soami Satsang Beas’ (RSSB) ఆధ్యాత్మిక సంస్థ స్థలంలో రాష్ట్రంలోని అతి పెద్ద కోవిడ్ క్వారంటైన్ కేంద్రం నిర్మించినట్టు తెలిసింది. ఇటీవల ప్రారంభించిన ఈ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ కి  ‘Maa Ahilya COVID Care Centre’ అని పేరు పెట్టారు. ఇండోర్ నగరంలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండడంతో, ఇండోర్ జిల్లా ప్రభుత్వ అధికారులు ‘Radha Soami Satsang Beas’ (RSSB) గ్రౌండ్ ని కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించికునట్టు ‘The Times of India’ రిపోర్ట్ చేసింది.

Radha Soami Satsang Beas’ (RSSB) అనేది పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆధ్యాత్మిక సంస్థ. RSSB తమకు రాజకీయ పార్టీలతో గాని, వేరే ఇతర వాణిజ్య పరమైన సంస్థలతో గాని సంబంధం ఉండదని తమ వెబ్సైటులో స్పష్టం చేసింది. RSSB సంస్థకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

‘Radha Soami Satsang Beas’ ఆధ్యాత్మిక సంస్థ గ్రౌండ్ లో నిర్మించిన ఈ కోవిడ్ క్వారంటైన్ కేంద్రంలో RSS కార్యకర్తలు వాలంటీర్లు గా పనిచేస్తున్నట్టు ‘Lokmat’ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. ఈ కోవిడ్ క్వారంటైన్ కేంద్ర నిర్మాణానికి కొందరు వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థలు విరాళాలు ఇచ్చినట్టు ‘India TV ’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో, సంఘ్ పరివార్ నడిపిస్తున్న 211 విద్యాసంస్థలని  కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవడానికి RSS నాయకులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతినిచ్చారు. కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న వారిని ఈ క్వారంటైన్ కేంద్రాలలో చికిత్స అందిస్తున్నట్టు ‘The Times of India’ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. కాని, ఇండోర్ నగరంలో నిర్మించిన ‘Maa Ahilya Covid care center’ ని RSS నిర్మించినట్టు ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు.

చివరగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద కోవిడ్ క్వారంటైన్ సెంటర్ అయిన ‘Maa Ahilya COVID Care Centre’ ని RSS నిర్మించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll