‘రాత్రి 11:30 తర్వాత మొత్తం ఒమాన్ దేశం అంతటా మిలిటరీ హెలికాప్టర్లతో కొరోనా వైరస్ నిర్మూలనకై ప్రత్యేక రసాయనాన్ని ఆకాశంలో విడుస్తున్నారు’ అని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఒమాన్ దేశం అంతటా మిలిటరీ హెలికాప్టర్లతో కొరోనా వైరస్ నిర్మూలనకై ప్రత్యేక రసాయనాన్ని ఆకాశంలో విడుస్తున్నారు.
ఫాక్ట్ (నిజం): మిలిటరీ హెలికాప్టర్లతో తాము అలాంటి ఎటువంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని ఒమాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. భారత్ లో కూడా అలాంటి మెసేజ్ వైరల్ అయినపుడు, అది ఒక ఫేక్ మెసేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఇచ్చిన విషయం గురించి గూగుల్ లో వెతకగా, ‘టైమ్స్ అఫ్ ఒమాన్’ వారి ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ విషయంపై ఒమాన్ ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ మిలిటరీ హెలికాప్టర్లతో కొరోనా వైరస్ నిర్మూలనకై ప్రత్యేక రసాయనాన్ని ఆకాశంలో విడుస్తూ తాము ఎటువంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని తెలిపాడని ఆ ఆర్టికల్ లో చదవొచ్చు.
భారత ప్రభుత్వం కూడా కొరోనా వైరస్ నిర్మూలనకై ప్రత్యేక రసాయనాన్ని ఆకాశంలో విడుస్తున్నారని మెసేజ్ వైరల్ అయినపుడు అది ఒక ఫేక్ మెసేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు తెలిపారు.
చివరగా, ఒమాన్ అంతటా మిలిటరీ హెలికాప్టర్లతో కొరోనా వైరస్ నిర్మూలనకై ప్రత్యేక రసాయనాన్ని ఆకాశంలో విడవట్లేదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?