అస్సాం వరదలకు సంబంధించిన ఫోటోలని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అస్సాం వరదలుకు సంబంధించిన ఫొటోలు.
ఫాక్ట్ (నిజం): ఇటీవల అస్సాంలో వరదలు సంభవించిన మాట నిజమైనప్పటికి పోస్ట్ లో షేర్ చేసిన ఫోటోలు అన్నీ అస్సాంకు సంబంధించినవి కావు. పైగా కొన్ని ఫోటోలు 2017, 2019 సంవత్సరాలకి సంబంధించినవి. కావున ఈ పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫోటో 1:
ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా ఈ ఫోటో 2019 ఆగస్టులో అస్సాం లో సంభవించిన వరదలకు సంబంధించింది. ఈ ఫోటోని ప్రచురించిన వార్త కథనం ఇక్కడ చూడొచ్చు.
ఫోటో 2:
ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, ఇది 2017 ఆగస్టులో బీహార్ లో వచ్చిన వరదలకు సంబంధించిందని ఈ వార్తా కథనం ద్వారా తెలిసింది.
ఫోటో 3:
ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, ఇది ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో సంభవించిన వరదలకు సంబంధించిందని తెలిసింది. ఈ ఫోటోని ప్రచురించిన వార్త కథనం ఇక్కడ చూడొచ్చు.
ఫోటో 4:
ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, ఇది ఇటీవల అస్సాంలో సంభవించిన వరదలదే అని తెలిసింది. ఈ ఫోటోని ప్రచురించిన వార్త కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఉత్తర ప్రదేశ్, బీహార్ వరదలకి సంబంధించిన ఫోటోలని అస్సాంలో సంభవించిన వరదల ఫోటోలుగా చెప్తున్నారు.