Fake News, Telugu
 

సైనికులు ఒక గర్భవతికి సహాయం చేస్తున్న ఈ దృశ్యాలు నిజము కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో

0

‘ఒక గర్భవతి తన లగేజ్ మోయడానికి ఇబ్బంది పడుతుంటే ఎవరు సహాయం చేయకపోగా అటువైపు నుంచి వస్తున్న ఇండియన్ ఆర్మీ సైనికులు ఆమెకు సహాయం చేసి ఆమె లగేజిని, ఆమెని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారంటూ’ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇబ్బంది పడుతున్నప్పుడు గర్భవతికి ప్రజలెవరూ సహాయం చేయనప్పుడు, ఇండియన్ ఆర్మీ సైనికులు ఆమెకు సహాయం చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో యొక్క పూర్తి నిడివిగల వీడియోని ప్రముఖ నటి ప్రియ గత సంవత్సరం జనవరిలో తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఐతే ప్రియ ఈ వీడియోని షేర్ చేసిన పోస్టులో ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు స్పష్టంగా పేర్కొంది.

పైగా వీడియో చివర్లో కూడా ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు స్పష్టంగా ఒక డిస్‌క్లైమెర్ కూడా ఉంది, ఐతే ఈ వీడియోలో డిస్‌క్లైమెర్ ఉన్న భాగాన్ని తీసేసి కేవలం మిగతా భాగాన్ని మాత్రమే షేర్ చేసారు. 

ఇటీవల కాలంలో ఇలాంటి పలు అవగాహన కల్పించే వీడియోలను ప్రముఖ వ్యక్తులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్న ట్రెండ్ పెరుగుతోంది. ఐతే ఈ వీడియోలను కొందరు డిస్‌క్లైమెర్ భాగాన్ని తీసేసి నిజంగా జరిగిన సంఘటనలవంటూ మరికొందరు ఈ వీడియోలను మతపరమైన అభియోగాలు చేస్తూ కూడా షేర్ చేస్తున్నారు. ఇలాంటి కొన్ని వీడియోల గురుంచి FACTLY రాసిన ఫాక్ట్ చెక్ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, భారత సైనికులు ఒక గర్భవతికి సహాయం చేస్తున్న ఈ దృశ్యాలు నిజము కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll