విశాఖపట్నంలో 2022 జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: విశాఖపట్నంలో 2022 జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఫాక్ట్: విశాఖపట్నంలో 2022 జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారని ఎటువంటి అధికారిక సమాచారం లేదు. పోస్టులోని ఆర్టికల్ ని ‘way2news’ వారు ప్రచురించినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అసలైతే 16 ఆగష్టు 2021 నుండి 31 ఆగష్టు 2021వ తేదీ వరకు విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా అది వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న సమాచారం మాకు దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతున్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అటువంటిది ఉంటే వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. joinindianarmy.nic.in వెబ్సైటులో కూడా విశాఖపట్నంలో జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారని లేదు.
పోస్టులోని ఆర్టికల్ ని ‘way2news’ వారు ప్రచురించినట్టు కూడా వారి సోషల్ మీడియా అకౌంట్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు వెబ్సైటులో ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్ట్ చేసిన ఫోటోలో ఆర్టికల్ మొత్తం ఒకే ఫాంట్ లో ఉన్నట్టు లేదు. తేదీలు ఎక్కడైతే రాసారో అక్కడ మార్ఫ్ చేసి ఆడ్ చేసినట్టుగా చూడొచ్చు.
అసలైతే 16 ఆగష్టు 2021 నుండి 31 ఆగష్టు 2021వ తేదీ వరకు విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా అది వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అన్న సమాచారం మాకు దొరకలేదు.
చివరగా, విశాఖపట్నంలో 2022 జనవరి 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.