Fake News, Telugu
 

విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని వస్తున్న వార్త ఫేక్

0

విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని చెప్తూ కొంతమంది ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి  నిజంగా అలాంటి ప్రకటన చేసిందో లేదో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.    

ఫాక్ట్ (నిజం): విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు, అది ఒక ఫేక్ న్యూస్. ఆ వార్తతో ఉన్న ‘ETV Andhra Pradesh’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

పోస్టు లోని విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రకటన ఏమీ చేయలేదని తెలుస్తుంది. ఒక వేల ఐక్యరాజ్య సమితి నిజంగా అలాంటి ప్రకటన చేస్తే, దేశంలోని వార్తా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అలాంటి న్యూస్ ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు. కావున, ఆ వార్తతో ఉన్న ‘ETV Andhra Pradesh’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది.

గతంలో కూడా ఐక్యరాజ్య సమితి (దాని ఏజెన్సీ ‘యునెస్కో’) పేరిట చాలా ఫేక్ వార్తాలు సోషల్ల్ మీడియాలో చలామణీ అయినప్పుడు, ‘FACTLY’ వాటిని తప్పని తెలుస్తూ రాసిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని వస్తున్న వార్త ఫేక్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll