Fake News, Telugu
 

జామియా లైబ్రరీ సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలోని వ్యక్తి మరియు జామియా కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి ఒకరు కాదు

0

‘జామియా యూనివర్సిటీ దగ్గర జరిగిన కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి, అంతకుముందు నెలక్రితం పోలీసుల మీదికి రాళ్లతో దాడిచేసిన వ్యక్తి ఒక్కడే’ అంటూ రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ 1: జామియా యూనివర్సిటీ దగ్గర జరిగిన కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి మరియు తాజాగా రిలీజ్ చేసిన 15 డిసెంబర్ 2019 జామియా లైబ్రరీ సీసీటీవీ ఫుటేజ్ లోని వ్యక్తి ఒక్కడే.    

ఫాక్ట్ (నిజం): 30 జనవరి 2020 న జామియా యూనివర్సిటీ దగ్గర జరిగిన కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి, షాదాబ్ నాజర్, 15 డిసెంబర్ 2019 జామియా లైబ్రరీ సీసీటీవీ ఫుటేజ్ లో లేడు లైబ్రరీలో జరిగిన ఆ ఘటన సమయానికి తను మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో డిసెంబర్ 13 నుండి 15 వరకు జరిగిన ‘జశ్న్-ఎ-రేఖత’ అనే ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్ళాడు. సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలోని వ్యక్తి మొహమ్మద్ అష్రఫ్ భట్ అని కొందరు పోస్ట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

జామియా లైబ్రరీ లో 15 డిసెంబర్ 2019 న జరిగిన ఘటనకి సంబంధించిన చాలా వీడియోలు వివిధ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలోని పొడుగు జుట్టు వ్యక్తి మొహమ్మద్ అష్రఫ్ భట్ అని కొందరు పోస్ట్ చేసారు. మొహమ్మద్ అష్రఫ్ భట్ పొలిటికల్ సైన్స్ డిపార్టుమెంటులో పీహెచ్‌డీ స్కాలర్ అని చెప్తూ ‘OpIndia’ వారు కూడా రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. అయితే, తన గురించి మరింత సమాచారం తెలియలేదు. కానీ, ‘ఆల్ట్ న్యూస్’ వారితో షాదాబ్ నాజర్ (జామియా కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి) మాట్లాడుతూ ఆ సీసీటీవీ ఫుటేజ్ లోని వ్యక్తి తను కాదు అని తెలిపాడు.

15 డిసెంబర్ 2019 కారిడార్ సీసీటీవీ ఫుటేజ్ లో సాయంత్రం 6:05:30 సమయానికి పొడుగు జుట్టు వ్యక్తిని చూడవొచ్చు. అయితే ఆ సమయానికి తను మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో డిసెంబర్ 13 నుండి 15 వరకు జరిగిన ‘జశ్న్-ఎ-రేఖత’ అనే ప్రోగ్రాంలో పాల్గొనడానికి వెళ్ళానని షాదాబ్ తెలిపాడు.  అంతేకాదు, ‘ఆల్ట్ న్యూస్’ వారితో, మరొక జామియా స్టూడెంట్, ఫాతిమా మాట్లాడుతూ, ‘సుమారు సాయంత్రం 6:30 కి స్టేడియం నుండి బయటికి వచ్చాము. కాలేజీ లో గొడవ జరుగుతుందని తెలియడం వల్ల సుమారు సాయంత్రం 7:30 వరకు ప్రగతి మైదాన్ మెట్రో స్టేషన్ దగ్గర అందరం కలిసే ఉన్నాము’ అని తెలిపింది. ‘ఆల్ట్ న్యూస్’ వారికి ఫాతిమా పంపిన ఫోటోలో షాదాబ్ ని చూడవొచ్చు. కావున, సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలోని వ్యక్తి మరియు జామియా కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి ఒకరు కాదు.

Courtesy: Alt News

క్లెయిమ్ 2: 15 డిసెంబర్ 2019 జామియా లైబ్రరీ సీసీటీవీ ఫుటేజ్ లోని పొడుగు జుట్టు వ్యక్తి చేతిలో రాయి చూడవొచ్చు.   

ఫాక్ట్ (నిజం): సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలోని పొడుగు జుట్టు వ్యక్తి చేతిలో ఉన్నది రాయి కాదు. సీసీటీవీ ఫుటేజ్ ని సరిగ్గా గమనిస్తే తన చేతిలో పర్స్ ఉందని చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

కొన్ని ప్రముఖ వార్తాసంస్థలు కూడా ఆ వ్యక్తి చేతిలో రాయి ఉందని ప్రచురించారు. జామియా లైబ్రరీ యొక్క సీసీటీవీ ఫూటేజ్ ని ఇక్కడ చూడవొచ్చు. ఆ వీడియోలో 4:51 మరియు 5:02 సెకండ్ల సమయం దగ్గర పొడుగు జుట్టు వ్యక్తి చేతులను సరిగ్గా గమనిస్తే, తన కుడి చేతిలో ఉన్నది పర్స్ అని తెలుస్తుంది. ఆ వ్యక్తి ఒక చేతిలో పర్స్, మరొక చేతిలో ఫోన్ లాంటి వస్తువు ఉందని ‘ఆల్ట్ న్యూస్’ వారు ఇంతకముందే రాసారు.

చివరగా, జామియా లైబ్రరీ సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలోని వ్యక్తి మరియు జామియా కాల్పుల్లో చేతికి గాయమైన వ్యక్తి ఒకరు కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll