Fake News, Telugu
 

ఈ వీడియో కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన సంఘటనకి సంబంధించింది

0

“ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీఎస్పీగా పనిచేసిన షానవాజ్ ఖాన్, పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో లక్షన్నర రూపాయలు మరియు అక్రమ ఆయుధాలను తన స్నేహితులకు అందజేస్తు అవినీతి నిరోధక టీమ్‌కి పట్టుబడ్డాడు.” అంటూ ఒక పోలీసును కొందరు వ్యక్తులు రోడ్డుపై తీసుకొని వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చెయ్యబడుతుంది. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీఎస్పీగా పనిచేసిన షానవాజ్ ఖాన్, పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో లక్షన్నర రూపాయలు, అక్రమ ఆయుధాలను తన స్నేహితులకు అందజేస్తు అవినీతి నిరోధక టీమ్‌కి పట్టుబడ్డాడు.

ఫాక్ట్ (నిజం): ఇది కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్‌ షానవాజ్ ఖాన్‌ని అరెస్టు చేస్తున్న వీడియో, DSPని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేస్తున్న వీడియో కాదు. యూపీలోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద పలువురిపై రింకూ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసులో హెడ్ కానిస్టేబుల్‌ షానవాజ్ ఖాన్‌ ₹ 15,000 లంచం తీసుకున్నాడు. ఈ విషయాన్ని రింకూ విజిలెన్స్ బృందానికి నివేదించాడు, వారు ఫిర్యాదును ధృవీకరించి స్టింగ్ ఆపరేషన్‌లో షానవాజ్‌ను పట్టుకున్నారు. తర్వాత షానవాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఆపి ఏసీపీ బాబు పూర్వా కార్యాలయం నుంచి అతన్ని చెప్పులు లేకుండా ఈడ్చుకెళ్లారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రాములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇదే వీడియోను 10 సెప్టెంబర్ 2024న కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ అరెస్టు” అనే శీర్షికతో NDTV ప్రచురించడం గమనించాం.

ఈ వీడియోని ఆధారంగా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఈ వార్తను ప్రచురించిన పలు న్యూస్ రిపోర్టులకు దారి తీసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, యూపీలోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద పలువురిపై రింకూ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసులో హెడ్ కానిస్టేబుల్‌ షానవాజ్ ఖాన్‌ ₹ 15,000 లంచం తీసుకున్నాడు. ఈ విషయాన్ని రింకూ విజిలెన్స్ బృందానికి నివేదించాడు, వారు ఫిర్యాదును ధృవీకరించి స్టింగ్ ఆపరేషన్‌లో షానవాజ్‌ను పట్టుకున్నారు. తర్వాత షానవాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఆపి ఏసీపీ బాబు పూర్వా కార్యాలయం నుంచి అతన్ని చెప్పులు లేకుండా ఈడ్చుకెళ్లారు. వైరల్ వీడియో ఈ దృశ్యాలను చూపిస్తుంది.

షానవాజ్ ఖాన్ పేరు గల ఒక డీఎస్పీ ₹1.5 లక్షలతో పట్టుబడ్డాడని, అక్రమ ఆయుధాలను మిత్రులకు అందించాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. వివరాల కోసం మేము UP విజిలెన్స్ విభాగాన్ని కూడా సంప్రదించాము. వారు ఈ కేసు 15,000 రూపాయల లంచానికి సంబంధించిన కేసు అని, అరెస్టు సమయంలో ఎటువంటి అక్రమ ఆయుధాలు లభించలేదని స్పష్టం చేశారు.

చివరిగా, ఈ వీడియో కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన సంఘటనకు సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll