CPM ని ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల రాజకీయ పార్టీ గా యునెస్కో ప్రకటించిందని చెప్తూ కొంతమంది ఫేస్బుక్ వినియోగదారులు అందుకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ యొక్క స్క్రీన్ షాట్ ని పోస్టు చేస్తున్నారు. ఆ విషయం ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.
ఆ పోస్టు 2018లో పెట్టినప్పటికీ, దానిని ప్రస్తుతం కూడా కొంతమంది షేర్ చేస్తున్నారు.
క్లెయిమ్: CPM పార్టీని ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల రాజకీయ పార్టీ అని యునెస్కో సర్టిఫై చేసింది.
ఫాక్ట్ (నిజం): CPM పార్టీని ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల రాజకీయ పార్టీ గా యునెస్కో సర్టిఫై చేసిందంటూ వస్తున్న వార్త ఒక పుకారు అని యునెస్కో సంస్థ వెల్లడించింది. కావున, పోస్టులో చెప్పింది అబద్ధం.
గూగుల్ లో ‘CPM party most honest party UNESCO’ అని కీవర్డ్స్ తో వెతికినప్పుడు, యునెస్కో సంస్థ వారి ట్వీట్ ఒకటి లభించింది. దాని ద్వారా, ఒక ట్విట్టర్ వినియోగదారుడు యునెస్కో ని తమ సంస్థ CPM పార్టీని ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల రాజకీయ పార్టీ గా సర్టిఫై చేసిందా అని అడిగినప్పుడు, ఆ సంస్థ అది ఒక ‘పుకారు’ అని తెలిపినట్లుగా తెలిసింది.
Dear @rajnbose, that’s a hoax. Unfortunately, we can’t track all the hoaxes out there.
— UNESCO (@UNESCO) October 10, 2018
గతంలో కూడా ఇలాంటి సర్టిఫికెట్ ఆధారాంగానే యునెస్కో సంస్థ ఇస్లాం మతాన్ని ప్రపంచ ప్రశాంత మతంగా ప్రకటించిందని వార్తలు వచ్చినప్పుడు ‘FACTLY’ సంస్థ రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవవచ్చు.
చివరగా, CPM పార్టీని ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల రాజకీయ పార్టీ గా యునెస్కో సర్టిఫై చేయలేదు. అది ఒక పుకారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Thank you for informing facts