Fake News, Telugu
 

బోస్టన్ విమానాశ్రయం లో అరెస్ట్ చేయబడ్డ భారత రాజకీయ నాయకుడు అని ఉన్నది నిజమయిన న్యూస్ క్లిప్ కాదు

0

ఫేస్బుక్ లో కొంతమంది ‘అరెస్ట్ చేయబడ్డ భారత రాజకీయ నాయకుడు’ అనే హెడ్ లైన్ తో ఉన్న ఒక వార్తా పత్రిక న్యూస్ క్లిప్ ని పోస్టు చేస్తున్నారు. ఆ క్లిప్  సెప్టెంబర్ 30, 2001న ప్రచురించినట్లుగా ఉంది. అందులో, బోస్టన్ విమానాశ్రయం లోని అధికారులు ఒక భారత రాజకీయ నాయకుడిని నిషేధించిన మత్తు పదార్ధాలతో మరియు లెక్కలోకి రానట్టి నల్లధనంతో పట్టుకున్నారని ఉంది. అంతేకాదు, పట్టుబడిన ఆ రాజకీయ నాయకుడు ఒక భారత మాజీ ప్రధాని కొడుకు అని ఉంది. పోస్టులో న్యూస్ క్లిప్ లో చెప్పింది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘బోస్టన్ విమానాశ్రయం లో మత్తు పదార్ధాలతో పట్టుబడ్డ భారత రాజకీయ నాయకుడు’ అని ఒక వార్తా పత్రిక ప్రచురించింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని న్యూస్ క్లిప్ డిజిటల్ గా రూపొందించబడినది. బోస్టన్ విమానాశ్రయం లో మత్తు పదార్ధాలతో భారత రాజకీయ నాయకుడు పట్టుబడ్డట్లుగా ఎక్కడా సమాచారం లభించలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

న్యూస్ క్లిప్ లో ఉన్న వార్త గురించి వెతికినప్పుడు, అందుకు సంబంధించిన సమాచారం ఏమీ లభించలేదు. ఒక భారత మాజీ ప్రధాని కొడుకు మత్తు పదార్ధాలతో పట్టుబడితే ఆ వార్త కచ్చితంగా దేశం లోని ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించేవి. కావున, అది ఒక ఫేక్ న్యూస్ క్లిప్. దానిని ‘fodey.com’ వంటి వెబ్సైటు ద్వారా రూపొందించి ఉండొచ్చు. ఆ వెబ్సైట్ ని ఉపయోగించి, మనకు కావాల్సిన హెడ్ లైన్ తో మనకు నచ్చిన కథని రాసి న్యూస్ క్లిప్ ని రూపొందించవచ్చు.

మరింత సమాచారం కోసం వెతికే ప్రయత్నం లో ‘The Hindu’ వారి సెప్టెంబర్ 30, 2001 నాటి కథనం ఒకటి లభించింది. అందులో, అమెరికా లో ‘సెప్టెంబర్ 11’ న టెర్రరిస్ట్ దాడుల అనంతరం చేపట్టిన భద్రత చర్యల్లో భాగంగా, బోస్టన్ విమానాశ్రయంలో FBI అధికారులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీని నిర్బంధించి సుమారు ఘంట పాటు విచారించిన అనంతరం వదిలేసినట్లుగా ఉంది. అంతేకానీ, పోస్టులో చెప్పిన విషయాలు  లేవు.

చివరగా, డిజిటల్ గా రూపొందించిన న్యూస్ క్లిప్ ని పెట్టి ‘బోస్టన్ విమానాశ్రయం లో మత్తు పదార్ధాలతో పట్టుబడ్డ భారత రాజకీయ నాయకుడు’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll