Fake News, Telugu
 

ఒక ‘మీమ్’ ని పెట్టి, ‘యూరప్ లో ఒక దినపత్రిక ప్రచురించిన కార్టూన్’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి, అది యూరప్ లో ఒక దినపత్రిక ‘ఇస్లాం’ మతం గురించి ప్రచురించిన కార్టూన్ అని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యూరప్ లో ఒక దినపత్రిక ‘ఇస్లాం’ మతం గురించి ప్రచురించిన కార్టూన్.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటోలో ఉన్నది ఒక ‘మీమ్’. దానిని యూరప్ లోని ఏ దినపత్రిక కూడా ప్రచురించినట్లుగా సమాచారం లభించలేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, దానికి సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఫోటో లో ఉన్న కార్టూన్ ని గత కొంత కాలంగా వివిధ రకాలుగా వాడుతున్నట్లుగా తెలిసింది. వివిధ సందర్భాలకి సంబందించిన మీమ్స్ ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఫోటోలోని కార్టూన్ ని యూరప్ లోని ఏ దినపత్రికైనా ప్రచురించిందా అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన సమాచారం ఏమీ లభించలేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

చివరిగా, ఒక ‘మీమ్’ ని పెట్టి, ‘యూరప్ లో ఒక దినపత్రిక ప్రచురించిన కార్టూన్’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll