Fake News, Telugu
 

జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ గెలిచే స్థానాలు జీరో అని వినోద్ కుమార్ అన్నట్టు ఉన్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది

0

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ ఒక్క స్థానం కూడా గెలవదని ఆ పార్టీ నేత బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ ఒక్క స్థానం కూడా గెలవదు – బోయినపల్లి వినోద్ కుమార్.

ఫాక్ట్(నిజం): ఇటీవల బోయినపల్లి వినోద్ కుమార్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో BRSకు కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఐతే వేరే పార్టీలను ఉద్దేశించి ఆయన వాడిన ‘జీరో’ అనే పదాన్ని ‘BRSకు ఎన్ని సీట్లు వస్తాయన్న’ ప్రశ్నకు బదులుగా అన్నట్టు డిజిటల్‌గా ఎడిట్ చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల బోయినపల్లి వినోద్ కుమార్ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో BRSకు కష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఈ ఇంటర్వ్యూకు సంబంధించిందే. ఐతే ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా BRSకు వచ్చే సీట్లు సున్నా అంటూ ఆయన అనలేదు.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా ఈ  ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వీడియో మాకు లభించింది. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRSకు ఎన్ని సీట్లు వస్తాయని విలేకరి అడిగిన ప్రశ్నకు వినోద్ కుమార్ స్పందిస్తూ ఈసారి తమ పార్టీకు కష్టంగా ఉంటుందంటూ అయన వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగానే మాట్లాడుతూ తమిళనాడులోని DMK & AIADMK ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ పార్టీల సభ్యులు ఒక్కసారి కూడా లోక్‌సభలో ఉండరు అంటూ ‘జీరో’ అనే పదాన్ని వాడతాడు.

ఐతే వినోద్ కుమార్ ‘జీరో’ అన్న క్లిప్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి, ‘BRSకు ఎన్ని సీట్లు వస్తాయన్న’ ప్రశ్నకు అయన ‘జీరో’ అన్నట్టు సృష్టించారు. దీన్నిబట్టి, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియో అని స్పష్టమవుతుంది.

చివరగా, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ గెలిచే స్థానాలు జీరో అని వినోద్ కుమార్ అన్నట్టు ఉన్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll