Fake News, Telugu
 

2016 ఫోటోని ‘ఇటీవల భారత సైనికులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన పాకిస్తాన్ సైనికులు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

1

కొంతమంది పాకిస్తాన్ సైనికులు కొన్ని శవపేటికలకు వారి దేశ జెండాని కప్పుతున్న ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి ‘ఇటీవల భారత సైనికులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన పాకిస్తాన్ సైనికులు’ అని పోస్టు చేస్తున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల భారత సైనికులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన పాకిస్తాన్ సైనికుల ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో 2016 లో పాకిస్తాన్ లోని ఒక పోలీస్ ట్రైనింగ్ అకాడమీ మీద మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన క్యాడెట్ లకు సంబంధించినది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.  

భారత సైన్యం 20 అక్టోబర్ 2019న పాకిస్తాన్ సైన్యం పై జరిపిన ఎదురు కాల్పుల్లో 6 నుండి 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లుగా ‘News18’ వారి కథనం ద్వారా తెలుస్తుంది. పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ ఫోటో ‘Dawn’ వార్తా పత్రిక ప్రచురించిన కథనం లో లభించింది. ఆ ఆర్టికల్ ద్వారా, 2016 లో పాకిస్తాన్ లోని క్వెట్టా అనే ప్రాంతం లో ఉన్న ఒక పోలీస్ ట్రైనింగ్ అకాడమీ మీద మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో సుమారు 59 మంది క్యాడెట్ లు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ ఆర్టికల్ లో ఆ సంఘటనకి సంబంధించిన చాలా ఫోటోలు ఉంటాయి, అందులో పోస్టులో పెట్టిన ఫోటో కూడా ఒకటి. ఆ ఫోటో క్రింద ‘జనరల్ మూసా స్టేడియంలో అంత్యక్రియల ప్రార్థన కోసం ఉంచబడిన పోలీస్ ట్రైనింగ్ అకాడమీ దాడిలో మరణించిన క్యాడెట్ల శవపేటికలు’ అనే  వివరణ ఉంది.

చివరగా, పోస్టులోని ఫోటో 2016 లో పాకిస్తాన్ లోని ఒక పోలీస్ ట్రైనింగ్ అకాడమీ మీద మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన క్యాడెట్ లకు సంబంధించినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll