Fake News, Telugu
 

ఉత్తరాఖండ్ పాతాళ్ భువనేశ్వర్ దేవాలయం దృశ్యాలని నేపాల్ పశుపతినాథ్ దేవాలయం దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

నేపాల్ దేశం ఖాట్మండు నగరంలోని పశుపతినాథ్ దేవాలయం దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఒక గుహలో ఉన్న శివాలయాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నేపాల్ దేశం ఖాట్మండు నగరంలోని పశుపతినాథ్ దేవాలయంలోని దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాతాళ్ భువనేశ్వర్ దేవాలయం, నేపాల్ దేశంలోని పశుపతినాథ్ దేవాలయం కాదు. సున్నపురాయి గుహలో నెలకొని ఉన్న ఈ పాతాళ భువనేశ్వర్ మందిరం ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరాఘర్ జిల్లాలో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలోని వ్యక్తి, తాను పాతాళ్ దేవాలయం దృశ్యాలని చూపుతున్నట్టుగా తెలపడం మనం గమనించవచ్చు. పోసులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాతాళ్ భువనేశ్వర్ దేవాలయమని వివరణలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అదే దేవాలయం దృశ్యాలని, మరొక యూసర్ కూడా ఇదే వివరణతో యూట్యుబ్‌లో షేర్ చేసారు.

ఈ వివరాల ఆధారంగా ఆ దేవాలయానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, పాతాళ్ భువనేశ్వర్ దేవాలయంలోని దృశ్యాలు చూపుతూ పలు న్యూస్ ఛానల్స్ మరియు ట్రావెల్ టూరిస్ట్ సైట్స్  వీడియోలు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దేవాలయ దృశ్యాలు ఈ వీడియోలలో మనం చూడవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరాఘర్ జిల్లాలో ఈ దేవాలయం ఉన్నట్టు ఉత్తరాంచల్ టూరిస్ట్ సైట్ వెబ్సైటులో తెలిపారు. సున్నపురాయి గుహలో  నెలకొని ఉన్న ఈ దేవాలయంలో శివుడిని కొలుస్తారని ఈ వెబ్సైటులో తెలిపారు.

నేపాల్ దేశం ఖాట్మండు నగరంలోని పశుపతినాథ్ దేవాలయంలోని దృశ్యాలని ఇక్కడ చూడవచ్చు. పశుపతినాథ్ దేవాలయానికి సంబంధించి భారతీయ వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ అర్టికల్స్‌లో చూపుతున్న పశుపతినాథ్ దేవాలయం, పోస్టులో చూపుతున్న దేవలయంతో పోలి లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాతాళ్ భువనేశ్వర్ దేవాలయమని, నేపాల్ పశుపతినాథ్ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, మలేసియా హిందూ దేవాలయంలో పాముకి పూజ చేస్తున్న వీడియోని నేపాల్ పశుపతినాథ్ దేవాలయంలోని దృశ్యాలుగా సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పాతాళ్ భువనేశ్వర్ దేవాలయం దృశ్యాలని నేపాల్ పశుపతినాథ్ దేవాలయం దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll