Fake News, Telugu
 

పోస్ట్ లో చెప్పిన కాశ్మీర్ పండితుల కథలో నిజం లేదు. ఫోటోలో ఉన్నది భోజ్ పురి నటి ‘కనక్ పాండే’

0

జమ్ముకాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ని తీసేస్తూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కాశ్మీర్ పండితులు బొట్టు పెట్టుకొని ధైర్యంగా బయట తిరుగుతున్నారు అని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జమ్మూ కాశ్మీర్ పై మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల ఫోటోలో కనిపిస్తున్న కాశ్మీర్ పండితులు మొదటి సారిగా వినాయక చవితిని జరుపుకున్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో గత సంవత్సరం నుండి సోషల్ మీడియా లో షేర్ అవుతుంది. అంతేకాదు, ఫోటోలో ఉన్నది భోజ్ పురి నటి ‘కనక్ పాండే’. గత సంవత్సరం తను ఉజ్జయినీ లోని మహా కాలేశ్వర్ గుడికి వెళ్ళినప్పుడు తీసి ఫోటో అది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోని గత సంవత్సరం ఆగష్టు లోనే ఒకరు ట్వీట్ చేసినట్టు చూడవచ్చు. అంతే కాదు, ఫోటోలో ఉన్నది భోజ్ పురి నటి ‘కనక్ పాండే’ అని సెర్చ్ రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది.

పోస్ట్ లోని ఫోటో కోసం తన ఫేస్బుక్ అకౌంట్ లో వెతకగా, గత సంవత్సరం జూలై లో తను పోస్ట్ లోని ఫోటోని పోస్ట్ చేసినట్టుగా చూడవచ్చు. అంతేకాదు, తను ఉజ్జయినీ లోని మహా కాలేశ్వర్ గుడికి వెళ్ళినప్పుడు తీసిన ఇతర ఫోటోలను కూడా తన అకౌంట్ లో చూడవచ్చు.

చివరగా, పోస్ట్ లో చెప్పిన కాశ్మీర్ పండితుల కథలో నిజం లేదు. ఫోటోలో ఉన్నది భోజ్ పురి నటి ‘కనక్ పాండే’.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll