Fake News, Telugu
 

వైజాగ్ గ్యాస్ లీక్ పై ‘@NarraSrinivasChowdary’ ట్వీట్ చేసినట్టుగా వైరల్ అవుతున్నది ఒక ఫేక్ ట్వీట్

0

‘మా అమరావతి ప్రజల ఏడుపు తగిలే వైజాగ్ వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఇంకా జరగాలి…’ అంటూ వైజాగ్ గ్యాస్ లీక్ గురించి ‘@NarraSrinivasChowdary’ అనే వ్యక్తి ట్వీట్ చేసినట్టుగా చెప్తూ, ఒక ట్వీట్ ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, అది ఒక ఫేక్ ట్వీట్ అని FACTLY విశ్లేషణలో తేలింది. ట్విట్టర్ వారి పాలసీ ప్రకారం యూసర్ పేరు 15 క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఉండదు. కానీ, పోస్ట్ చేసిన ట్వీట్ లో యూసర్ పేరు (‘@NarraSrinivasChowdary’) లో 21 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఆ పేరుతో ఉన్నది ఫేక్ ట్వీట్.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ట్విట్టర్ పాలసీ – https://help.twitter.com/en/managing-your-account/twitter-username-rules

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll