Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

గంగా నదిలో కొరోనాను నిరోధించే కణాలు ఏమైనా ఉన్నాయా అని తాము ఎటువంటి స్టడీ మొదలు పెట్టలేదని ICMR వారు తెలిపారు

0

‘గంగా నీటిలో మాత్రమే ఉన్న నింజ పాలిమర్స్ కరోనాను నిరోధించే అవకాశం ఉంది. దానిపై పరిశోధనలు చేస్తున్న భారత శాస్త్రవేత్తలు’ అని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గంగా నదిలో కొరోనాను నిరోధించే కణాలు ఉన్నాయా అని పరిశోధన చేస్తున్న భారత శాస్త్రవేత్తలు.

ఫాక్ట్ (నిజం): గంగా నదిలో కొరోనాను నిరోధించే కణాలు ఉన్నాయా అని చూడమని ఒక ప్రతిపాదన మాత్రమే తమకు వచ్చిందని, దానిపై తాము ఎటువంటి స్టడీ మొదలు పెట్టలేదని ఐసీఎంఆర్ (ICMR) వారు FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లో ఇప్పటికే పరిశోధన జరుగుతుంది అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 

పోస్టులో ఇచ్చిన విషయం గురించి వెతకగా, ‘ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్’ వారి ఆర్టికల్ ఒకటి  సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. గంగా నదిలో కొరోనాను నిరోధించే కణాలు ఉండవచ్చని, దాని పై పరిశోధన చేయమని ఆర్మీ వెటరన్స్ సభ్యులుగా కలిగిన  ‘అతుల్య గంగా’ అనే ఒక సంస్థ వారు జల్ శక్తి మంత్రిత్వ శాఖ కి ప్రతిపాదన పంపించినట్టు తెలుస్తుంది. అయితే, ఆ ప్రతిపాదనను జల్ శక్తి మంత్రిత్వ శాఖ కి చెందిన ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా’ వారు ఐసీఎంఆర్ (ICMR) కి పంపించినట్టు ఆ ఆర్టికల్ లో చదవొచ్చు.

ఆ విషయం గురించి ICMR ని FACTLY సంప్రదించగా, గంగా నదిలో కొరోనాను నిరోధించే కణాలు ఉన్నాయా అని చూడమని ఒక ప్రతిపాదన మాత్రమే తమకు వచ్చిందని, దానిపై తాము ఎటువంటి స్టడీ మొదలు పెట్టలేదని ఐసీఎంఆర్ వారు FACTLY కి తెలిపారు.

అంతేకాదు, ‘అతుల్య గంగా’ వారు చెప్పింది ‘నింజా వైరస్’ గురించి, పోస్టులో చెప్పినట్టు ‘నింజా పాలిమర్స్’ గురించి కాదు. ‘Bacteriophage’ అనేది ఒక వైరస్, అది బాక్టీరియా మీద పనిచేస్తుంది. కొరోనా అనేది ఒక వైరస్; బాక్టీరియా కాదు.  ‘అతుల్య గంగా’ వారు కూడా కొరోనా కు ‘నింజా వైరస్’ పనిచేస్తుందని చెప్పలేదు. గంగాలో ‘నింజా వైరస్’ ఉన్నట్టు తెలిసింది, కాబట్టి కొరోనా తగ్గించడానికి ఏమైనా కణాలు ఉన్నాయా అని పరిశోధన చేయమన్నారు.

చివరగా, గంగా నదిలో కొరోనాను నిరోధించే కణాలు ఏమైనా ఉన్నాయా అని తాము ఎటువంటి స్టడీ మొదలు పెట్టలేదని ICMR వారు తెలిపారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll