Fact Check, Fake News, Telugu
 

పాన్ కార్డుని ఆధార్ తో జత చేసుకోకపోతే గరిష్టంగా 1,000 రూపాయల జరిమానా కట్టాలి, 10,000 రూపాయలు కాదు

0

వివరణ (APRIL 01, 2021):
COVID-19 వల్ల తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 31 మార్చి 2021న PAN కార్డుని ఆధార్ తో అనుసంధానించడానికి గల చివరి తేదిని 30 జూన్ 2021 వరకు పొడిగిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

పాన్ కార్డు నంబర్ని ఆధార్ నంబరుతో లింక్ చేసుకోకపోతే 10,000 రూపాయిల జరిమానా విధించడంతో పాటు తమ పాన్ కార్డుని ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. పాన్ కార్డు ఆధార్ నంబరుతో లింక్ చేసుకోవడానికి చివరి తేది 31 మార్చి 2021 అని మరొక పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాన్ కార్డు ఆధార్ నంబరుతో లింక్ చేసుకోకపోతే 10,000 రూపాయిల జరిమానా తో పాటు పాన్ కార్డుని రద్దు చేయనున్న కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): పాన్ కార్డు ని ఆధార్ నంబరుతో లింక్ చేసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ 31 మార్చి 2021 వరకు గడువిచ్చిన మాట వాస్తవమే. పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే  జరిమానా కట్టాలన్న మాట కూడా వాస్తవం. కానీ, ఆ జరిమానా గరిష్టంగా 1000 రూపాయలు ఉంటుంది, 10,000 రూపాయలు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పాన్ కార్డు ఆధార్ నంబరుతో జత చేసుకోవాలని గడువిచ్చి అనేక సార్లు గడువు చివరి తేదిని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం,  ఇప్పుడు తాజాగా పాన్ కార్డు ఆధార్ నంబరుతో లింక్ చేసుకోవడానికి 31 మర్చి 2021 చివరి తేది అని ప్రకటించింది. చివరి తేది వరకు పాన్ కార్డుని ఆధార్ నంబరుతో లింక్ చేసుకోకపోతే జరిమానాతో పాటు తమ పాన్ కార్డుని రద్దు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాన్ కార్డు ఆధార్ నంబరుతో లింక్ చేసుకోకపోతే జరిమానా కట్టాలన్న మాట వాస్తవం. కానీ, ఆ జరిమానా 10,000 రూపాయలు కాదు. ఇటివల లోక్ సభలో పాస్ చేసిన The Finance Bill, 2021 లో, 234H అనే కొత్త సెక్షన్ ని Income Tax Act, 1961 చట్టంలో కలిపారు. ఈ కొత్త  సెక్షన్ ప్రకారం పాన్ కార్డు ఆధార్ నంబరుతో లింక్ చేసుకోకపోతే గరిష్టంగా 1,000 రూపాయిల వరకు జరిమానా కట్టవలిసి వస్తుంది. ఈ విషయాన్నీ తెలుపుతూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, Income Tax Act, 1961 చట్టంలోని 272B సెక్షన్ ప్రకారం ‘ఒక వ్యక్తి సెక్షన్ 139A లోని నిబంధలను పాటించడంలో విఫలమైతే, అసెసింగ్ ఆఫీసర్ అతనికి 10,000 వరకు జరిమానా విధించవచ్చు.  సెక్షన్ 139Aలోని ఈ నియమాన్ని పాన్ కార్డుని ఆధార్ నంబరుతో లింక్ చేసే ప్రక్రియకు ముడిపెడుతూ, చివరి తేది లోపు పాన్ కార్డు జత చేయకపోతే 10,000 రూపాయలు జరిమానా కట్టవలిసి  వస్తుందని తప్పుగా షేర్ చేస్తున్నారు.

చివరగా, పాన్ కార్డు ని ఆధార్ నంబరుతో 31 మర్చి 2021 వరకు జత చేసుకోకపోతే జరిమానా కట్టవలిసింది గరిష్టంగా 1000 రూపాయల, 10,000 రూపాయలు కాదు. పాన్ కార్డుని ఆధార్ నంబరు తో జత చేసుకునే విధానాన్ని Unique Identification Authority of India (UIDAI) వెబ్సైటులో చూడవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll