Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని నాగార్జునసాగర్ BJP ప్రచార వేదికపై కేవలం ఒక కుక్క మాత్రమే ఉన్నట్టు షేర్ చేస్తున్నారు

0

నాగార్జునసాగర్ లో అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ BJP ప్రచారానికి ప్రజాస్పందన లేనట్టు అర్ధం వచ్చేలా BJP ప్రచార వేదికపై కేవలం ఒక కుక్క ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో BJP ప్రచార వేదికపై కేవలం ఒక కుక్క చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నాగార్జునసాగర్ లో BJP ప్రచార వేదికపై కేవలం ఒక కుక్క మాత్రమే ఉన్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): 2015 లేదా అంతకన్నా ముందు జరిగిన అల్ ఇండియా ఫెడరేషన్ అఫ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హేల్పెర్స్ (AIFAWH) మీటింగ్ కి సంబంధించిన ఫోటోని ఎడిట్ చేసి AIFAWH జెండాలకి బదులు BJP జెండాలు పెట్టారు. ఈ ఫోటోకి నాగార్జునసాగర్ లో జరిగే ఉప ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అచ్చం ఇలాంటిదే ఒక ఫోటో, కాకపోతే BJP జెండాలకు బదులు ఎరుపు రంగు జెండాలు, స్టేజిపై ఎర్ర తివాచీ ఉన్న ఫోటోని 2015లో షేర్ చేసిన ఒక ట్విట్టర్ పోస్టు మాకు కనిపించింది. దీన్ని బట్టి ఈ ఫోటో పాతదని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికకి సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

2015లో షేర్ చేసిన ఫోటోలోని ఎరుపు రంగు జెండాలను పరిశీలించి, ఆ జెండాలపై ఉన్న అక్షరాల ఆధారంగా గూగుల్ లో వెతకగా ఇవి అల్ ఇండియా ఫెడరేషన్ అఫ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హేల్పెర్స్ (AIFAWH) యొక్క జెండాలతో పోలి ఉండడం గమనించొచ్చు,(ఉదాహారణకి జెండాల పై వైట్ బ్యాక్ గ్రౌండ్ లో AIFAWH అక్షరాలు చూడొచ్చు). ఐతే ఆ స్టేజీ మాత్రం ఎప్పటి మీటింగ్ కి సంబంధించిందో కచ్చితమైన సమాచారం మాత్రం మాకు లభించలేదు. కాకపోతే ఈ ఫోటోలోని ఎరుపు రంగు జెండాలకు బదులు BJP జెండాలు మరియు కాషాయ రంగు తివాచీగా డిజిటల్ గా ఎడిట్ చేసారని మాత్రం చెప్పొచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన అంగన్వాడి వర్కర్స్ మీటింగ్ యొక్క ఫోటోని నాగార్జునసాగర్ BJP ప్రచార వేదికపై కేవలం ఒక కుక్క మాత్రమే ఉన్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll