ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పోస్టు చేసి, అది అమరావతి లో రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించినదని పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫోటో అమరావతి నుంచి రాజధానిని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించినది.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో కనీసం ఏప్రిల్ 2018 నుండి ఇంటర్నెట్ లో ఉంది. కావున, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించడానికంటే ముందే జరిగిన ఘటనకి సంబంధించినది. పోస్టులో చెప్పింది తప్పు.
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 17, 2019న రాష్ట్రానికి మూడు రాజధానుల గురించి ప్రతిపాదించినట్లుగా ‘Times of India’ వారి కథనం ద్వారా తెలుస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు.
పోస్టులోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ఒక ట్విట్టర్ యూజర్ పెట్టిన ట్వీట్ లో లభించింది. ఆ ట్వీట్ ద్వారా ఆ ఫోటోకి సంబంధించిన సమాచారమేమీ తెలియకపోయినప్పటికీ, దానిని ఏప్రిల్ 26, 2018న పెట్టినట్లుగా చూడవచ్చు. టీడీపీ పరిపాలనలో మహిళల పరిస్థితి అని షేర్ చేస్తే అవి ఫేక్ అంటూ ఆ ట్వీట్ పెట్టారు.
కావున, ఆ ఫోటో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించడానికంటే ముందే జరిగిన ఘటనకి సంబంధించినదని చెప్పవచ్చు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?