ఒక సభలో మోడీ మరియు అమిత్ షా, అద్వానీని అగౌరవ పరిచారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఫోటో మరియు వీడియో అంటూ పెట్టిన ఐదు నెలల క్రితం పెట్టిన పోస్టు ని గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: మోడీ మరియు అమిత్ షా, సభలో అద్వానీని అగౌరవపరిచిన వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్‌లో పెట్టిన వీడియో క్లిప్ ‘బిజెపి నేషనల్ కౌన్సిల్ మీట్ -2014’ సందర్భంగా తీసిన వీడియోలోని భాగం. పూర్తి వీడియోలో ఆ క్లిప్ కి ముందు మరియు తరువాత సన్నివేశాలు చూసినప్పుడు, పోస్టులో ఆరోపించినట్లుగా మోడీ మరియు అమిత్ షా, అద్వానీని అగౌరవ పరచలేదని తెలుస్తుంది. కావున, పోస్ట్ ప్రక్కదారి పట్టించేలా ఉంది.
పోస్టులో ఉన్న ఫోటో ‘బిజెపి నేషనల్ కౌన్సిల్ మీట్ -2014’ కి సంబంధించినదని అందులో ఉన్న బ్యాక్ గ్రౌండ్ ద్వారా తెలుస్తుంది. ఆ మీటింగ్ యొక్క పూర్తి వీడియో యూట్యూబ్ లో లభించింది. ఆ వీడియోలో ‘21min 30 secs’ నిడివి దగ్గర కుర్చీలో కూర్చున్న అమిత్ షా అద్వానీని సభలో ప్రసంగించమని అడగడం చూడవచ్చు. కానీ, అద్వానీ తాను పోడియం నుండి ప్రసంగిస్తానని తెలుపడంతో, షా పోడియం ఉన్న దిశను చూపిస్తాడు. ఆ తర్వాత అద్వానీ పోడియం దగ్గరకి వెళ్లి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోస్టు లో ఉన్న క్లిప్ ఆ సందర్భంలో కత్తిరించబడినట్లుగా ఆ పూర్తి వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
చివరగా, మోడీ మరియు అమిత్ షా, అద్వానీని అగౌరవ పరచలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?