Fake News, Telugu
 

హైదరాబాద్ హైకోర్టు చైనా ప్రొడక్ట్స్ ను నిషేదించలేదు. అది ఒక ఫేక్ మెసేజ్

0

భారత దేశం చైనా నుండి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ తాజాగా హైదరాబాద్ హైకోర్టు చైనా ప్రొడక్ట్స్ ను నిషేధించింది అని చెప్తూ కొందరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాన్ని చైనా సమర్దిస్తున్నందుకు హైదరాబాద్ హైకోర్టు చైనా ప్రొడక్ట్స్ ను నిషేధించింది. చైనా వస్తువులు అమ్మినవారికి రూ. 2500, కొన్నవారికి రూ. 1500 జరిమానాలు ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ హైకోర్టు చైనా ప్రొడక్ట్స్ ను నిషేదించలేదు. ఇదే మెసేజ్ ని గత మూడేళ్ళగా వివిధ కోర్టుల పేర్లతో పోస్ట్ చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎటువంటి నిజం లేదు.

పోస్ట్ లో  ఇచ్చిన విషయాల గురించి గూగుల్ లో వెతకగా, హైదరాబాద్ హైకోర్టు చైనా ప్రోడుక్టుల మీద ఎటువంటి నిషేధం ప్రకటించలేదని తెలుస్తుంది. ఇదే మెసేజ్ ని గత మూడేళ్ళగా వివిధ కోర్టుల పేర్లతో పోస్ట్ చేస్తున్నారు. ఒకసారి బీహార్ హైకోర్టు పేరుతో చేస్తే మరోసారి నిజామాబాద్ కోర్టు పేరుతో చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

చివరగా, హైదరాబాద్ హైకోర్టు చైనా ప్రొడక్ట్స్ ను నిషేదించలేదు. అది ఒక ఫేక్ మెసేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll