Fake News, Telugu
 

రెండేళ్ళ క్రితం వార్తను తీసుకుని, తాజాగా ‘పాక్ అణ్వాయుధ క్షేత్ర ఆడ్రస్ లు దొరికాయి’ అంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు

0

భారత్ పై పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేస్తామని చెప్తున్న సమయంలో పాక్ అణ్వాయుధ క్షేత్రల ఆడ్రస్ లను అమెరికాకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటించిందంటూ ‘journalist sai’ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వీడియోని కొందరు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా దొరికిన పాక్ అణ్వాయుధ క్షేత్ర ఆడ్రస్ లు.

ఫాక్ట్ (నిజం): రెండేళ్ళ క్రితం ‘Federation of American Scientists (FAS)’ వారు ప్రచురించిన పాక్ అణ్వాయుధ క్షేత్రల ఆడ్రస్ లను తీసుకొని, తాజాగా వెలువడిన వివరాలు అంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియోలో చెప్పిన విషయాల గురించి గూగుల్ లో ‘Pakistan Nuclear Weapons locations’ అని వెతకగా, ఈ విషయం పై 2017 లో ‘Zee News’ మరియు ‘Times of India’ ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వీడియోలో చెప్పిన తొమ్మిది ప్రదేశాల ఆడ్రస్ లను ఒక్క పదం తేడా లేకుండా ‘Zee News’ ఆర్టికల్ లో చూడవచ్చు. ‘Federation of American Scientists (FAS) అనే సంస్థ ఆ అడ్రస్ లను ప్రచురించినట్టుగా ఆ ఆర్టికల్ లో చదవచ్చు.

ఇదే విషయాన్నీ ‘Federation of American Scientists (FAS)’ వెబ్సైటు లో 2016 లో ప్రచురించిన ఒక ఆర్టికల్ లో చూడొచ్చు. ఆ ఆర్టికల్ లో ప్రతి పాక్ అణ్వాయుధ క్షేత్ర ఆడ్రస్ యొక్క వివరణ ఉంది. ఇదే విషయాన్నీ, అవే వివరాలతో వీడియో లో చూడొచ్చు.

చివరగా, రెండేళ్ళ క్రితం వార్తను తీసుకుని తాజాగా ‘పాక్ అణ్వాయుధ క్షేత్ర ఆడ్రస్ లు దొరికాయి’ అంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll