కోర్టులో వాదిస్తుంటే తన భార్య చనిపోయిందనే సమాచారం వచ్చినా, తను ఆపకుండా వాదించి 46 స్వాతంత్ర్య సమరయోధులకు ఉరి శిక్ష పడకుండా బీ.ఆర్.అంబేడ్కర్ చేసారని చెప్తూ, ఒక కథతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కోర్టులో వాదిస్తుంటే తన భార్య చనిపోయిందనే సమాచారం వచ్చినా, తను ఆపకుండా వాదించి 46 స్వాతంత్ర్య సమరయోధులకు ఉరి శిక్ష పడకుండా బీఆర్ అంబేడ్కర్ చేసారు.
ఫాక్ట్: భార్య చనిపోయే ముందు రోజే అంబేడ్కర్ తిరిగి వచ్చాడని, అదృష్టవశాత్తు తన భార్య చనిపోయినప్పుడు అంబేడ్కర్ అక్కడే ఉన్నారని ‘డా. అంబేడ్కర్: లైఫ్ అండ్ మిషన్’ పుస్తకంలో చదవచ్చు. అంబేడ్కర్ మరియు రమాబాయిపై తీసిన వివిధ సినిమాల్లో కూడా రమాబాయి చనిపోయినప్పుడు అంబేడ్కర్ తన దగ్గరే ఉన్నట్టు చూడవచ్చు. కావున, పోస్ట్‌లో చెప్పిన కథ తప్పు.
పోస్ట్‌లో చెప్పిన కథ గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కోర్టులో అంబేడ్కర్ వాదిస్తున్న సమయంలో తన భార్య రమాబాయి చనిపోయినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం లభించలేదు. భార్య చనిపోయే ముందు రోజే అంబేడ్కర్ తిరిగి వచ్చాడని, అదృష్టవశాత్తు తన భార్య చనిపోయినప్పుడు అంబేడ్కర్ అక్కడే ఉన్నారని ‘డా. అంబేడ్కర్: లైఫ్ అండ్ మిషన్’ పుస్తకంలో చదవచ్చు.
అంబేడ్కర్ జీవిత చరిత్రపై వేరేవారు రాసిన మరో పుస్తకంలో కూడా తన భార్య మరణానికి సంబంధించి పోస్ట్‌లో చెప్పిన కథ లేదు. అంతేకాదు, అంబేడ్కర్ మరియు రమాబాయిపై తీసిన వివిధ సినిమాల్లో కూడా రమాబాయి చనిపోయినప్పుడు అంబేడ్కర్ తన దగ్గరే ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
పోస్ట్‌లో చెప్పిన కథ సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి సంబంధించిందా?
పోస్ట్‌లో చెప్పిన అదే కథ సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఆపాదిస్తూ 2021లో కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు.
అయితే, సర్దార్ పటేల్ తన భార్య చనిపోయిన విషయం తెలిసినా కూడా కోర్టులో కేసు వాదించినట్టు “పటేల్: ఏ లైఫ్” పుస్తకంలో చదవచ్చు. కాకపోతే, ఆ పుస్తకంలో తను 46 స్వాతంత్ర్య సమరయోధుల కోసం వాదించాడని లేదు. ఆ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం “పటేల్: ఏ లైఫ్” పుస్తకంలో చదవచ్చు.
చివరగా, తన భార్య రమాబాయి చనిపోయినప్పుడు అంబేడ్కర్ తన దగ్గరే ఉన్నారు; పోస్ట్‌లో చెప్పిన కథ తప్పు.