Fake News, Telugu
 

ఒక మహిళ ఒకే కాన్పులో 17 మంది చిన్నారులకు జన్మనిచ్చిందంటూ వస్తున్నవి ఫేక్ న్యూస్

1

కేథరిన్ బ్రిడ్జ్ అనే మహిళ ఒకే కాన్పులో 17 మంది చిన్నారులకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది అంటూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కేథరిన్ బ్రిడ్జ్ అనే మహిళ ఒకే కాన్పులో 17 మంది చిన్నారులకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఫాక్ట్ (నిజం): మొట్టమొదటిసారిగా, అమెరికన్ మహిళ కేథరిన్ బ్రిడ్జ్, ఒకే కాన్పులో 17 మంది చిన్నారులకు జన్మనిచ్చిందని అదే దేశానికి చెందిన “World News Daily Report” అనే ఒక వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్సైట్ ప్రచురించింది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.

పోస్ట్ లో పేర్కొన్న విషయం గురించి వెతికినప్పుడు, మొట్టమొదటిసారిగా అటువంటి కథనాన్ని “World News Daily Report(WNDR)” అనే ఒక సెటైరికల్ వెబ్సైట్ ప్రచురించిందని తెలిసింది. ఆ తరవాత, “Women Daily Magazine” అలా వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఒక కథనాన్ని ప్రచురించింది. కొంత మంది ‘WNDR’ ప్రచురించిన ఆర్టికల్ లోని కథనాన్ని ఆధారంగా చేసుకుని, వేరే రెండు ఫోటోలను జతపరిచి ఫేస్బుక్ మరియు సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లలో షేర్ చేస్తున్నారు.

పోస్ట్ లో కడుపుతో ఉన్న మహిళ ఫోటోలను ‘Tineye’ అనే చైనా వారి సెర్చ్ ఇంజన్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఆ ఫోటో ఎడిట్ చేయబడిన ఫోటో అని తెలిసింది.  ‘deviantart.com’ అనే వెబ్సైట్ లో ఒరిజినల్ మరియు ఫోటోషాప్ చేసిన చిత్రాలు లభించాయి.

పోస్ట్ లో ఒక వ్యక్తి పిల్లలను పట్టుకుని ఉన్న ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ‘Huffpost’ వారు ప్రచురించిన ఒక కథనంలో లభించింది. దాని ఆధారంగా, అందులో ఉన్న వ్యక్తి అమెరికన్ అబ్స్ట్రేటిషన్, డాక్టర్ రాబర్ట్ బిటర్  అని తెలిసింది.

గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రకారం ఇప్పటివరకు ఒకే కాన్పులో అత్యధికంగా జన్మించిన పిల్లల సంఖ్య ఎనిమిది. చివరగా, ఒక మహిళ ఒకే కాన్పులో 17 మంది చిన్నారులకు జన్మనిచ్చిందంటూ వస్తున్నవి ఫేక్ న్యూస్

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

scroll