Fake News, Telugu
 

సావర్కర్ మరియు నెహ్రు ని ఈ జైలు గదిలలో ఎందుకు ఉంచారు

0

కొంత కాలంగా కింద ఉన్న ఫోటో సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. జైల్లో సావర్కర్ గారు చాలా సామాన్యమైన జీవితం గడిపారని కానీ నెహ్రు గారిని బ్రిటిష్ వాళ్ళు చాలా విలాసంతమైన జైలు గదిలో ఉంచారని దాని ఉద్దేశం. దాంట్లో ఎంత నిజముందో విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం.

వీర్ సావర్కర్ గారిని బ్రిటిష్ ట్రిబ్యునల్ 1911 లో హత్యా నేరం కింద దోషిగా ప్రతిగనించి 50 ఏళ్ళ శిక్ష విధించారు. ఆ శిక్ష అమలు పరిచే ప్రక్రియలో సావర్కర్ గారిని సెల్యూలర్ జైలుకి తరలించారు. 1942 లో క్విట్ ఇండియా మూవ్మెంట్ సంధర్బంలో ముందస్తు అరెస్ట్ లో నెహ్రు మరియు 11 ఇతర భారతీయులని బ్రిటిష్ వారు డీటేన్ చేసి అహ్మద్నగర్ ఫోర్ట్ జైలుకు తరలించారు.

 

వీర్ సావర్కర్ గారి జైలు గది అని గూగల్ లో వెతికితే ఈ మధ్య మోడీ గారు సెల్యూలార్ జైలులో సావర్కర్ గారి గదిని సందర్శించిన ఫోటో వస్తుంది (పక్కన ఉన్న ఫోటో). దాని ప్రకారం పైన పోస్ట్ లోని సావర్కర్ గారి గది ఫోటో నిజంగా వారు ఉన్న గదేనని చెప్పొచు. అలానే ఆహ్మేద్నగర్ ఫోర్ట్ జైలు లోని నెహ్రు గారి గది అని గూగుల్ లో వెతికితే కింద ఉన్న ఫోటో వస్తుంది. కావున పోస్ట్ లోని రెండు ఫోటోలు దాంట్లో రాసిన విధంగా సావర్కర్ మరియు నెహ్రు గారి గదులే. కానీ వాటి రెండిటిని పోల్చలేము. ఎందుకంటే సావర్కర్ గారు తపించుకోవడానికి ఒకసారి ప్రయత్నిచారని మరియు 50 ఏళ్ళ శిక్ష పడినందున సెల్యూలర్ జైల్లో ఉంచారు. కానీ నెహ్రు గారికి ఎలాంటి శిక్ష పడ లేదు కేవలం డిఫెన్సు ఆక్ట్ కింద ముందస్తు అరెస్ట్ చేసారు. నెహ్రు గారినే కాదు పటేల్, మౌలాన, అసఫ్ అలీ వంటి పెద్ద నాయకులను కూడా అదే జైలులో ఉంచారు.

సెల్యూలర్ జైలు ఖైదీలను ఉంచడానికి ప్రత్యేకించి నిర్మించారు కానీ ఆహ్మేద్నగర్ ఫోర్ట్ జైలు మాత్రం ఒక కోటని జైలులాగా మార్చారు. కావున రెండు గదులు వేరే విధంగా ఉండవచ్చు.

చివరగా, పైన ఉన్న పోస్ట్ లోని ఫోటోలు నిజమైనవే కానీ ఆ రెండిటిని పోల్చలేము. కానీ ఆ రెండిటిని పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తునారు.

Share.

About Author

Comments are closed.

scroll