Fake News, Telugu
 

కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరించినట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది

0

తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరించిన చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరిస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడినది. సోనియా గాంధీ మరియు కేసీఆర్‌లకు సంబంధించిన రెండు వేర్వేరు ఫోటోలని ఎడిట్ చేసి ఈ ఫోటోని రూపోంధించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరించారో లేదో తెలుసుకొనేందుకు కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరించారని తెలుపుతూ ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు బహిరంగంగా నమస్కరిస్తే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు కథనాలు పబ్లిష్ చేసేవి.  

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, కేసీఆర్ వంగి మరొకరి పాదాలకు నమస్కరిస్తున్న అసలైన ఫోటో దొరికింది. 2015 జూన్ నెలలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు, కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ పాదాలను తాకి స్వాగతం పలికిన దృశ్యాన్ని అసలైన ఫోటో చూపిస్తుంది.

సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి దిగిన పాత ఫోటోని, కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ పాదాలకు నమస్కరిస్తున్న ఫోటోను ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారు.

చివరగా, కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరిన్న దృశ్యంగా షేర్ చేస్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll