Fake News, Telugu
 

ఈ ఫోటోలు సింగపూర్ లోని ఒక హైవే పై నిర్మించిన ఒక బ్రిడ్జివి, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేకి సంబంధించినవి కావు

0

ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో జంతువులు దాటడానికి నిర్మించిన బ్రిడ్జి అని చెప్తూ, ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో జంతువులు దాటడానికి నిర్మించిన బ్రిడ్జి ఫోటోలు.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటోలు సింగపూర్ లోని Bukit Timah Expressway పై జంతువులు దాటడానికి వీలుగా 2013లో నిర్మించిన బ్రిడ్జివి. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఐతే నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా (NHAI) నిర్మాణంలో ఉన్న ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పై జంతువులు దాటడానికి వీలుగా భారతదేశంలోనే మొదటిదైన బ్రిడ్జిలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీన్నిబట్టి ఈ ఫోటోలకి ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేకి సంబంధంలేదని చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ పోస్టులో ఉన్న ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే ఫోటోలు ప్రచురించిన ఒక సింగపూర్ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ బ్రిడ్జిని సింగపూర్ లోని Bukit Timah Expressway పై Bukit Timah Nature Reserve మరియు Central Catchment Nature Reserve ని  కలిపేలా 2013లో నిర్మించారు. ఐతే  ఈ బ్రిడ్జిపైకి  మొదటిసారిగా సాధారణ ప్రజలను మాత్రం 2015లో అనుమతించారు.

పైన పేర్కొన్న కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా సింగపూర్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లాన్స్ లో భాగంగా ఈ బ్రిడ్జి గురించి వివరించే ఒక బ్లాగ్ మాకు కనిపించింది. ఈ బ్రిడ్జి గురించి మరింత సమాచారం ఇక్కడ చదవొచ్చు, ఈ బ్రిడ్జి గురించిన హైలైట్స్ ఈ వీడియోలో చూడొచ్చు.

నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా (NHAI) నిర్మాణంలో ఉన్న ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పై జంతువులు దాటడానికి వీలుగా భారతదేశంలోనే మొదటిదైన బ్రిడ్జిలను నిర్మించాలని చూస్తున్న నేపథ్యంలో ఇలాంటి పోస్టులను సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, ఈ ఫోటోలు ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేకి సంబంధించినవి కావు, ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు.  

Share.

About Author

Comments are closed.

scroll