Fake News, Telugu
 

ఈ వీడియోలోని పాట రుగ్వేదంలోని మన్యు సూక్తం కాదు, బొమ్మ బొమ్మ థా అనే భక్తి గేయం

0

మహద్భుతం.ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు…. ఇది రుగ్వేదంలోని మన్యు సూక్తం. దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని రుగ్వేదంలో రాయబడింది….’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: పోస్టులో వీడియోలో గాయని పాడుతున్న పాట రుగ్వేదంలోని మన్యు సూక్తం.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో గాయని పాడుతున్నది  బొమ్మ బొమ్మ థా  అనే భక్తి పాట. ఈ పాటను భక్తి పాటల గాయకురాలు, శారద రాఘవ్ పాడారు, ఈ పాటని తాను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసారు. ఈ పాటని రుగ్వేదంలోని మన్యు సూక్తం అని పోస్టులో తప్పుగా చెప్తున్నారు, అంచేత పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

రుగ్వేదంలోని మన్యు సూక్తం  గురించి ఇంటర్నెట్లో వెతకగా, చాలా యూట్యూబ్ వీడియోలు లభించాయి. కానీ ఆ వీడియోలలో ఉన్న మన్యు  సూక్తానికి పోస్టులో ఉన్న పాటకి ఎటువంటి సంబంధం లేదు. మన్యు సూక్తాన్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలో ఉన్న పాటలోని మొదటి కొన్ని అక్షరాలతో ఇంటర్నెట్ లో వెతకగా. బొమ్మ బొమ్మ థా అనే భక్తి పాట యొక్క అనేక కవర్ వెర్షన్లు యుట్యుబ్‌లో ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి వైరల్ పోస్టులో ఉన్న వీడియో. ఈ పాటని శారద రాఘవ్ అనే భక్తి పాటలు పడే గాయని పాడారు. తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియో 2019లో అప్లోడ్ చేసారు. పోస్టులో ఈ పాటనే మన్యు సూక్తం అని తప్పుగా చెప్తున్నారు. మన్యు సూక్తం గురించి మరింత సమాచారం ఇక్కడ పొందవచ్చు.

చివరిగా, ఈ వీడియోలోని పాట రుగ్వేదంలోని మన్యు సూక్తం కాదు; బొమ్మ బొమ్మ థా అనే భక్తి గేయం.

Share.

About Author

Comments are closed.

scroll