Fake News, Telugu
 

2018 వీడియోని ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రజలు చేస్తున్న నిరసనగా చిత్రికరిస్తున్నారు

0

దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలని నిరసిస్తూ కొంతమంది ప్రజలు ఒక పెట్రోల్ బంక్ పై దాడి చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఒక పెట్రోల్ బంక్ పై దాడి చేస్తూ తమ నిరసన తెలుపుతున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2018లో ఓడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూరి నగర సమీపంలోని ఒక పెట్రోల్  బంక్ లో తీసుకుంటున్న డబ్బులు కంటే తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే కారణంతో వినియోగదారులు బంక్ పై దాడి చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. వీటిలో చాలా వరకు పోస్టులు 2018లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర చోటుచేసుకునట్టు ఈ పోస్టుల వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన ఒక న్యూస్ ఆర్టికల్ దొరికింది. ఓడిశా రాష్ట్రం పూరి నగర సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ పై వినియోగదారులు దాడికి పాల్పడినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. తీసుకున్న డబ్బులు కంటే తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే కారణంతో వినియోగదారులు ఈ దాడికి పాల్పడినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఘటన 29 సెప్టెంబర్ 2018 నాడు జరిగినట్టు ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు.

ఇదివరకు, ఈ వీడియోని ఇదే క్లెయిమ్ తో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2018లో ఓడిశా పెట్రోల్ బంకు పై జరిగిన దాడిని, ఇటివల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రజలు చేస్తున్న నిరసనగా చిత్రికరిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll