Fake News, Telugu
 

2018 లో ఒడిశా లోని పెట్రోల్ పంప్ పై జరిగిన దాడి వీడియోని, తాజాగా జరిగిన ఘటనగా ప్రచారం చేస్తున్నారు

0

దేశం లో గత ఇరవై రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ సందర్భం లో ఒక వీడియో సోషల్ మీడియా లో విస్తారంగా చలామణీ అవుతోంది.  ఆ వీడియో లో కొంతమంది వ్యక్తులు పెట్రోల్ పంప్ పై దాడి చేస్తూ కనిపిస్తారు. ఆ వ్యక్తులు వరుసగా పెరుగుతున్న పెట్రోల్, మరియు డీజిల్ ధరలను ఖండిస్తూ ఆ విధంగా చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రస్తుతం పెరుగుతోన్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ఖండిస్తూ ప్రజలు పెట్రోల్ పంప్ పై దాడి చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ): వీడియో లోని ఘటన 2018 లో ఒడిశాలో జరిగింది. పూరీ లోని ఒక పెట్రోల్ వారు తక్కువ పెట్రోల్ పోసి మోసం చేస్తున్నారనే కారణంతో వినియోగదారులు ఆ పెట్రోల్ పంప్ పై దాడికి దిగారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన అనేక సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ వీడియో ని చాలా మంది అక్టోబర్ 2018 లో ఫేస్బుక్ లో పోస్టు చేసి అందులోని ఘటన ఒడిశా లోని పెట్రోల్ పంప్ లో జరిగిందని పేర్కొన్నారు. ఆ సెర్చ్ రిజల్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ సమాచారంతో టైం ఫిల్టర్ పెట్టి వెతికినప్పుడు, ‘పూరీ’ లోని ఒక పెట్రోల్ పంప్ వారు తమకి తక్కువ పెట్రోల్ పోసి మోసం చేస్తున్నారనే కారణంతో వినియోగదారులు ఆ పెట్రోల్ పంప్ పై దాడికి దిగారని చాలా కథనాలు లభించాయి. ఆ ఘటన ’29 సెప్టెంబర్ 2018′ న జరిగినట్లుగా ఆ కథనాల ద్వారా తెలుస్తుంది. 

‘BOOM’ వారు కూడా ఆ విషయం గురించి పూరీ లోని కుంభరపద పోలీసులను సంప్రదించినప్పుడు, పెట్రోల్ పంప్ వారు తక్కువ పెట్రోల్ పోస్తున్నారనే కారణంగా వినియోగదారులు దాడికి దిగినట్లుగా తెలిపారు. 

చివరగా, 2018 లో ఒడిశా లోని పెట్రోల్ పంప్ పై దాడి జరిగిన వీడియో ని పెట్టి, తాజాగా జరిగిన ఘటనదని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll