Fake News, Telugu
 

మోదీ ప్రభుత్వం అన్ని చైనా వస్తువుల పై 200% టాక్స్ వేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు

0

చైనా వస్తువులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధిక టాక్స్ వేసి తీసేసిందని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక 200% టాక్స్ వేసారని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా వస్తువుల పై 200% టాక్స్ వేసిన మోదీ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): ): కేవలం చైనా నుండి వచ్చే అన్ని వస్తువుల పై మోదీ ప్రభుత్వం 200% టాక్స్ వేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. 2020 బడ్జెట్ లో బొమ్మల పై 200% టాక్స్ (కస్టమ్స్ డ్యూటీ – 20% నుండి 60% కి పెరిగింది) పెంచింది. కానీ అది కేవలం చైనా నుండి వచ్చే బొమ్మలకు మాత్రమే వర్తించదు, మిగితా దేశాలకు కూడా వర్తిస్తుంది. అయితే, బయట దేశాల నుండి వచ్చే బొమ్మల్లో సుమారు 75 శాతం చైనా నుండి వస్తాయి. అంతేకాదు, కొన్ని దేశాల నుండి వచ్చే వస్తువుల పై ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తుంది. మోదీ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివిధ దేశాల వస్తువుల పై యాంటీ డంపింగ్ డ్యూటీ వేసింది. కావున పోస్ట్ లో సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కేవలం చైనా నుండి వచ్చే అన్ని వస్తువుల పై మోదీ ప్రభుత్వం 200% టాక్స్ వేసినట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. గల్వాన్ ఘటన తర్వాత చైనా దిగుమతులపై కఠినమైన నిబంధనలు మరియు టారిఫ్ లను విధించాలని భారత ప్రభుత్వం యోచిస్తుందని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ మాత్రమే సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. 200% టాక్స్ వేసినట్టు ఎక్కడా లేదు. 2019 లో పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ని 200% కి పెంచినట్టు ఇక్కడ చదవొచ్చు. కానీ, అలాంటి నిర్ణయం చైనా పై తీసుకున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.

2020 బడ్జెట్ లో ప్రభుత్వం బొమ్మల పై 200% టాక్స్ (కస్టమ్స్ డ్యూటీ – 20% నుండి 60% కి పెరిగింది) పెంచింది. కానీ, అది కేవలం చైనా నుండి వచ్చే బొమ్మలకు మాత్రమే వర్తించదు, మిగితా దేశాలకు కూడా వర్తిస్తుంది. అయితే, బయట దేశాల నుండి వచ్చే బొమ్మల్లో సుమారు 75 శాతం చైనా నుండి వస్తాయి. వివిధ వస్తువుల పై భారతదేశం విధించే కస్టమ్స్ డ్యూటీ వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

కొన్ని దేశాల నుండి వచ్చే వస్తువుల పై ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీ (ఇత‌ర దేశాల నుంచి ఏదైనా స‌రుకు లేదా వ‌స్తువుల‌ను ఆ మార్కెట్ లో ల‌భించే ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కు దిగుమ‌తి చేస్తే వాటిపై విధించే టారిఫ్) వేస్తుంది. మోదీ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివిధ దేశాల వస్తువుల పై (చైనా మాత్రమే కాదు) యాంటీ డంపింగ్ డ్యూటీ వేసింది. ఆ వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, మోదీ ప్రభుత్వం అన్ని చైనా వస్తువుల పై 200% టాక్స్ వేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll