Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘Coronil’ ఔషధానికి అనుమతి ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వం ఏ డాక్టర్ ను గాని మెడికల్ ఆఫీసర్ ను గాని విధుల నుండి తొలగించలేదు

0

పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనాకు చికిత్సగా తయారు చేసిన ‘Coronil’ ఔషధానికి అనుమతి ఇవ్వనందుకు ముజాహిద్ హుస్సేన్ అనే డాక్టర్ ని కేంద్రం తొలగించింది, అంటూ షేర్ చేస్తున్న ఓక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పతంజలి ప్రకటించిన ‘Coronil’ ఔషదానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ తాము ఈ ఔషదానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదంటూ ప్రకటించిన నేపద్యంలో ఈ పోస్ట్ వైరల్ చేయడం జరిగింది.ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పతంజలి సంస్థ తయారు చేసిన ‘Coronil’ ఔషధానికి అనుమతి ఇవ్వనందుకు, ముజాహిద్ హుస్సేన్ అనే డాక్టర్ ను కేంద్రం విధులనుండి తొలగించింది.

ఫాక్ట్ (నిజం): ): ఆయుష్ మంత్రిత్వ శాఖ తాము ఈ మధ్యకాలంలో తమ డాక్టర్లని గాని మెడికల్ ఆఫీసర్లని తొలగించలేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసారు. PIB వారు కూడా ఈ వివరణతో వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్ అని తెలియజేసింది. FACTLY విశ్లేషణలో ముజాహిద్ హుస్సేన్ అనే పేరు గల డాక్టర్ అయుష్ వెబ్సైటులో లేరని తెలిసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చేసిన క్లెయిమ్ కోసం విచారించగా, అయుష్ మంత్రిత్వ శాఖ దీనిపై ఇప్పటికే తమ ట్విట్టర్ మరియు ఫేస్బుక్ అకౌంట్లో స్పష్టతనిస్తూ పోస్ట్ చేసిందని తెలిసింది. తాము, తమ డాక్టర్లను గాని మెడికల్ ఆఫీసర్లను గాని తొలగించలేదని అయుష్ మంత్రిత్వ శాఖ తమ పోస్ట్ లో స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వారు కూడా ఈ వివరణతో వైరల్ అవుతున్న పోస్ట్ లు తప్పు అని తెలియజేసింది. అంతేకాదు, FACTLY విశ్లేషణలో ముజాహిద్  హుస్సేన్ అనే పేరు ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో లేనట్లు తెలుసుకోవడం జరిగింది.

‘Coronil’ పై జరుగుతున్న వివాదంలో ఇదో ముందడుగు, అంటూ పతంజలి ఆయుర్వేద సంస్ధ M.D. ఆచార్య బాల్ కృష్ణ  ఆయుష్ మంత్రిత్వ శాఖ పంపిన లేఖను షేర్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఆ లేఖలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘Coronil’ కి సంభందించిన రీసెర్చ్ సమాచారాన్ని విశ్లేషించిన తరువాతే ఆ ఔషదాన్ని అనుమతిస్తాము అని రాయడం జరిగింది.

చివరగా, పతంజలి తాయారు చేసిన ‘Coronil’ ఔషదానికి అనుమతి ఇవ్వలేదని డాక్టర్లని గాని మెడికల్ ఆఫీసర్లని గాని విధులనుండి కేంద్రం తొలగించలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll