Fake News, Telugu
 

ఈ వీడియో హుజూర్ నగర్ ఉప ఎన్నికలది కాదు

1

పోలింగ్ బూత్ లో ఉన్న ఒక మహిళ ఇతర మహిళలను దగ్గరుండి ఓటు వేయిస్తున్న వీడియో ని చాలా మంది ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ ఘటన హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంలో జరిగినట్లుగా అందులో ఆరోపిస్తున్నారు. అదే ఆరోపణతో ఉన్న ఒక యూట్యూబ్ వీడియోని కూడా పోస్టులో పెట్టారు. పోస్టులోని ఆరోపణ ఎంత వరకు నిజమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన వీడియో. 

ఫాక్ట్ (నిజం): హుజూర్నగర్ లో ఉప ఎన్నికలు అక్టోబర్ 21, 2019 న జరిగాయి. కానీ, పోస్టు లో పెట్టిన వీడియో యూట్యూబ్ లో కనీసం మే 2019 నుండి ఉన్నట్లుగా చూడవొచ్చు. కావున, అది ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించినది కాదు. పోస్టులోని ఆరోపణ తప్పు.  

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ వీడియోని భిన్న ఆరోపణలతో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లుగా ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియోల టైం స్టాంప్ చూసినట్లయితే మే 2019 లో అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది. కానీ, హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు అక్టోబర్ 21, 2019 న జరిగాయి . కావున, ఆ వీడియోలోని ఘటన ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించినది కాదు.

ఆ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, అది వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు-2019 సందర్భం లో జరిగినట్లుగా ‘Siasat Daily’ వార్తా సంస్థ పేర్కొన్నది. కానీ, అందుకు సంబంధించిన సమాచారం ఇంకెక్కడా లభించలేదు.

చివరగా, ఆ వీడియో ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించినది కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll