Fake News, Telugu
 

అమిత్ షా కుమారుడు జై షా ని విమర్శిస్తూ కపిల్ దేవ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు

0

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఒత్తిడి వల్లనే భారత క్రికెటర్స్ రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారని ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడైన జై షా ఒత్తిడి వల్లనే భారత క్రికెటర్స్ రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు’  ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు.

ఫాక్ట్ (నిజం): అమిత్ షా కుమారుడు జై షా ని విమర్శిస్తూ కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక న్యూస్ వీడియోలు గానీ లేవు. కపిల్ దేవ్ అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో కూడా జై షా ని విమర్శిస్తూ ఎటువంటి ట్వీట్ చేయలేదు. పైగా రైతులకి మరియు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ వివాదం త్వరగా పరిష్కారమవ్వాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపే  వార్తా కథనాలు, న్యూస్ వీడియోలు లేక మరే ఇతర సమాచారం గాని మాకు లభించలేదు. కపిల్ దేవ్ అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో కూడా జై షా ని విమర్శిస్తూ తను ఎటువంటి ట్వీట్ చేయలేదు. సాధారణంగా కపిల్ దేవ్ లాంటి వ్యక్తి హోం మినిస్టర్ కుమారుడి పై ఆరోపణలు చేస్తే వార్తా పత్రికలు కచ్చితంగా ప్రచురిస్తాయి, కాని ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. 

పైగా 04 ఫిబ్రవరి 2021న రైతులకి మరియు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ వివాదం త్వరగా పరిష్కరమవ్వాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసాడు. ఇదే విషయాన్నీ కొన్ని వార్త సంస్థలు కూడా ప్రచురించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి పోస్టులో చెప్పినట్టు కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేయలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

రైతుల నిరసనలకు సంబంధించి అమెరికన్ పాప్ స్టార్ రిహన్న చేసిన ట్వీట్ కి స్పందిస్తూ పలువురు భారత క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రహనే ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

చివరగా, అమిత్ షా కుమారుడు జై షా ని విమర్శిస్తూ కపిల్ దేవ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll