Fake News, Telugu
 

యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్లుగా ఉన్న ఇమేజ్ ఫోటోషాప్ చేసినది

0

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్లుగా ఉన్న ఇమేజ్ సోషల్ మీడియా లో చాలా షేర్ అవుతోంది. ఇది ఎంతవరకు వాస్తవమైనదో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టు లోని ఫోటో ఫోటోషాప్ చేసినది. ఒరిజినల్ ఇమేజ్ లో ఆదిత్యనాథ్ చేతి పంపు నుండి వచ్చే నీళ్ళని తాగుతూ కనిపిస్తాడు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు. 

ఇమేజ్ గురించి సమాచారాన్ని వెతికే క్రమంలో, ట్విట్టర్ లో అదే ఫోటో చలామణీ అయినప్పుడు, ఒక జర్నలిస్ట్ అది తప్పంటూ, దానికి సంబంధించిన వాస్తవ ఫోటోని పెట్టిన ట్వీట్ లభించింది. అందులో ఆవు ఉండదు మరియు ఆదిత్యనాథ్ ఒక చేతి పంప్ లో నుండి వస్తున్న నీళ్లు తాగుతూ కనిపిస్తాడు. ఆ రెండు ఫోటోలని పోల్చినప్పుడు, అందులోని పరిసారాలన్నీ ఒకేల ఉండడం చూడవచ్చు.

పోస్టులోని ఫోటోలో ఆవు ఉన్న భాగాన్ని క్రాప్ చేసి వెతికినప్పుడు, ఆ ఆవు యొక్క పూర్తి ఫోటో ఒక వెబ్సైటు లో లభించింది. కావున, ఆ ఫోటోలోని ఆవు యొక్క వెనుక భాగాన్ని పైన ఉన్న ఒరిజినల్ ఫోటోలో చేర్చి పోస్టులోని ఫోటోను సృష్టించారు.

చివరగా, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్లుగా ఉన్న ఇమేజ్ ఫోటోషాప్ చేసినది. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll