Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

బీఫ్ కొరోనా వైరస్ కి విరుగుడని ‘యూరోప్ హెల్త్ ఆర్గనైజేషన్’ వెల్లడించలేదు. ఆ పేరుతో ఎటువంటి అధికారిక సంస్థ లేదు

0

‘బీఫ్ కొరోనాకు విరుగుడని EHO తెలిపింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్ కు విరుగుడును యూరప్ వైద్యులు కనుగొన్నారు. బీఫ్ లో విరివిగా దొరికే నియాసిన్ విటమిన్ మరియు గ్లుటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్ కి వైరస్ ను ఎదుర్కొనే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది’ అని  ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీఫ్ కొరోనాకు విరుగుడని యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్ (EHO) తెలిపింది.

ఫాక్ట్ (నిజం): ‘యూరోప్ హెల్త్ ఆర్గనైజేషన్’ పేరిట యూరోప్ లో అధికారిక సంస్థ ఏది లేదు. అంతేకాదు, యురోపియన్ యూనియన్ లో కొరోనా వైరస్ (COVID-19) గురించి సూచనలు జారీ చేస్తున్న హెల్త్ ఏజెన్సీ ఏదీ కూడా కొరోనా వైరస్ బీఫ్ కి విరుగుడని ప్రకటించలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు. 

బీఫ్ కొరోనా వైరస్ కు విరుగుడని యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్ (EHO) తెలిపిందని పోస్టులో చెప్పారు. కానీ, ఆ పేరుతో యూరోప్ లో అధికారిక సంస్థ ఏదీ లేదని తెలిసింది. యురోపియన్ యూనియన్ కి కొరోనా వైరస్ (COVID-19) కి సంబంధించిన సమాచారాన్ని యురోపియన్ కమిషన్ వెబ్సైటు మరియు యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వెబ్సైటు తెలుపుతోంది. కానీ, అవి ఏవీ కూడా కొరోనా వైరస్ కి బీఫ్ విరుగుడని ప్రకటించలేదు.

బీఫ్ తో కొరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ యూరప్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిందని ఫేస్బుక్ లో మరో మెసేజ్ చలామణీ అవుతోంది. కానీ, ఆ విషయాన్ని ద్రువికరిస్తూ కూడా సమాచారం ఏమీ లభించలేదు.

చివరగా, ‘యూరోప్ హెల్త్ ఆర్గనైజేషన్’ పేరిట యూరోప్ లో అధికారిక సంస్థ ఏది లేదు. యూరోప్ యొక్క ఏ హెల్త్ ఏజెన్సీ కూడా బీఫ్ కొరోనా వైరస్ కి విరుగుడని వెల్లడించలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll