Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

UNICEF పేరు మీద షేర్ అవుతున్న కొరోనా వైరస్ మెసేజ్ లో చాలా వరకు క్లెయిమ్స్ తప్పు లేదా ధృవీకరించబడనివి.

0

తాజాగా మరికొన్ని కోవిడ్-19 (కొత్త కొరోనా వైరస్ వల్ల కలిగే వ్యాధి) పాజిటివ్ కేసులు భారత్ లో రిపోర్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరస్ కి సంబంధించి చాలా మెసేజిలు వైరల్ అవ్తున్నాయి. కొరోనా వైరస్ ని నివారించడానికి యూనిసెఫ్ (UNICEF) సూచించిన చర్యలు అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

కానీ, మెసేజ్ లోని క్లెయిమ్స్ ని ఫాక్ట్-చెక్ చేసే ముందు, కోవిడ్-19 (కొరోనా వైరస్) గురించి కింద ఫోటో ద్వారా తెలుసుకుందాం.

ఇప్పుడు, ఆ పోస్ట్ లోని క్లెయిమ్స్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ 1: పోస్టులోని ముందు జాగ్రత్త చర్యలను యూనిసెఫ్ (UNICEF) సూచించింది. 

ఫాక్ట్ (నిజం): వైరల్ అవుతున్న మెసేజ్ ని యూనిసెఫ్ (UNICEF) జారీ చేయలేదు. పోస్టులో సూచించిన ముందు జాగ్రత్త చర్యలు కోవిడ్-19 పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నాయి. అలాగే, పోస్టులో సూచించిన కొన్నిటికి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు. 

యూనిసెఫ్ (UNICEF) ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు మరియు యువకుల అవసరాలను చూసుకుంటుంది. కోవిడ్-19 నుండి తమను మరియు తమ పిల్లలను ఎలా రక్షించుకోవాలో తల్లిదండ్రులకు సలహా ఇస్తూ UNICEF తమ వెబ్సైటులో పెట్టిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు. పోస్టులో ఉన్న చాలా వరకు ముందు జాగ్రత్త చర్యలు UNICEF వారి వెబ్సైటులో లేవు. అంతేకాదు, కొన్ని జాగ్రత్త చర్యలు UNICEF మరియు WHO యొక్క అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నాయి (మాస్క్ వాడకం మరియు వేడి వాతావరణం వైరస్ వ్యాప్తి తగ్గించడంపై).

క్లెయిమ్ 2: కొరోనా వైరస్ యొక్క సైజు 400-500 మైక్రాన్లు. కాబట్టి, మాస్క్ ధరించడం వలన ప్రజలు కోవిడ్-19 బారిన పడకుండా ఉంటారు.   

ఫాక్ట్ (నిజం): వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని WHO తెలిపింది. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మరియు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని చూసుకుంటున్న వ్యక్తులకి మాస్క్ ధరించాల్సిందిగా WHO సూచించింది. అంతేకాదు, వైరస్ బారిన పడకుండా ఉండాలంటే, కేవలం మాస్క్ ఒక్కటి వాడితే సరిపోదని, మిగితా నివారణ చర్యలు కూడా పాటించాలని తెలిపింది. పోస్టులో చెప్పినట్టు కొరోనా వైరస్ యొక్క సైజు 400-500 మైక్రాన్లు కాదు, కేవలం 0.12 మైక్రాన్లు మాత్రమే. కావున, పోస్ట్ లో చెప్పింది కేవలం కొంత వరకు మాత్రమే నిజం.

వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని WHO వారి వెబ్సైటులోని కొరోనా వైరస్ ‘ఎఫ్ఎక్యూ’ (FAQ) సెక్షన్ లో రాసి ఉన్నట్టు చూడవొచ్చు (‘WHO advises rational use of medical masks to avoid unnecessary wastage of precious resources and misuse of masks. Use a mask only if you have respiratory symptoms (coughing or sneezing), have suspected COVID-19 infection with mild symptoms, or are caring for someone with suspected COVID-19 infection’). సీడీసీ (Centers for Disease Control and Prevention) వారు కూడా ఆరోగ్యమైన వ్యక్తులకు మాస్కులు సూచించలేదు.

కేవలం మాస్క్ ఒక్కటి వాడితే సరిపోదని, మిగితా నివారణ చర్యలు కూడా పాటించాలని WHO వారు రిలీజ్ చేసిన ఒక డాక్యుమెంట్ లో చదవొచ్చు (‘the use of a mask alone is insufficient to provide the adequate level of protection and other equally relevant measures should be adopted. If masks are to be used, this measure must be combined with hand hygiene and other IPC measures to prevent the human-to-human transmission of 2019-nCov…Wearing medical masks when not indicated may cause unnecessary cost, procurement burden and create a false sense of security that can lead to neglecting other essential measures such as hand hygiene practices. Furthermore, using a mask incorrectly may hamper its effectiveness to reduce the risk of transmission’). మాస్క్ ఎలా వాడలో చెప్తూ WHO వారు పెట్టిన వీడియోలను ఇక్కడ చూడవొచ్చు. మాస్కుల వాడకం పై ‘ది గార్డియన్’ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా మాస్కుల కొరత ఉందని, కాబట్టి కేవలం వ్యాధి లక్షణాలు ఉన్నవారు మరియు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని చూసుకుంటున్న  వ్యక్తులు మాత్రమే మాస్కులు ఉపయోగించాలని కోరుతూ WHO పెట్టిన మెసేజ్ ని వారి వెబ్సైటులో చూడవొచ్చు. (‘Only wear a mask if you are ill with COVID-19 symptoms (especially coughing) or looking after someone who may have COVID-19. Disposable face mask can only be used once. If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely’.)

కొరోనా వైరస్ యొక్క సైజు సుమారు 0.12 మైక్రాన్లు (125 nm) అని ‘The New England Journal of Medicine’ లో ప్రచురితమైన ఆర్టికల్ లో చూడవొచ్చు (‘the electron micrographs of negative-stained 2019-nCoV particles were generally spherical with some pleomorphism. Diameter varied from about 60 to 140 nm. Virus particles had quite distinctive spikes, about 9 to 12 nm, and gave virions the appearance of a solar corona’). ‘SARS-CoV-2’ వైరస్ యొక్క ఎలెక్ట్రాన్ మైక్రోస్కోపీ ఇమేజ్ ని ఇక్కడ చూడవొచ్చు.

మాస్కుల రకాలు మరియు వాటి ప్రభావం గురించి ‘బిజినెస్ ఇన్సైడర్’ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. అందరు వాడుతున్న సర్జికల్ మాస్కులు 5 మైక్రాన్ల  కంటే తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ ని ఫిల్టర్ చేయవని,  కొరోనా వైరస్ యొక్క సైజు సుమారు 0.12 మైక్రాన్లు అని ‘డైలీ మెయిల్’ ఆర్టికల్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

క్లెయిమ్ 3: కొరోనా వైరస్ మెటల్ (లోహం)పై 12 గంటలు, బట్టపై 9 గంటలు మరియు చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 

ఫాక్ట్ (నిజం): కొరోనా వైరస్ పై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొన్ని గంటల నుండి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై వైరస్ ఉండవచ్చని WHO వారు తెలిపారు. ఒక్కొక్క ఉపరితలం పై కొత్త కొరోనా వైరస్ ఎంతసేవు ఉంటుందో అనే సమాచారం లేదు. ఈ టాపిక్ పై మరింత అధ్యయనం జరగవలిసి ఉంది. కావున, పోస్ట్ లో చెప్పింది ఇంకా ధృవీకరించబడలేదు. 

వివిధ ఉపరితలాలపై కొరోనా వైరస్ ఎంతసేపు ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని, ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొన్ని గంటల నుండి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై వైరస్ ఉండవచ్చని WHO వారి వెబ్సైటులో చదవొచ్చు (‘it is not certain how long the virus that causes COVID-19 survives on surfaces, but it seems to behave like other coronaviruses. Studies suggest that coronaviruses (including preliminary information on the COVID-19 virus) may persist on surfaces for a few hours or up to several days. This may vary under different conditions (e.g. type of surface, temperature or humidity of the environment)’.

‘ఉపరితలాలపై కొరోనా వైరస్ ఎంతసేపు ఉంటుంది?’ అనే టాపిక్ పై ‘రాయిటర్స్’ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ మరియు కరోనా వైరస్లపై మునుపటి అధ్యయనాల విశ్లేషిస్తూ ప్రచురితమైన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. ఒక్కొక్క ఉపరితలం కొత్త కొరోనా వైరస్ ఎంతసేవు ఉంటుందో అనే కచ్చితమైన సమాచారం లేదు. ఈ టాపిక్ పై మరింత అధ్యయనం జరగవలిసి ఉంది.

క్లెయిమ్ 4: కోవిడ్-19 యొక్క వ్యాప్తి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల ఆగిపోతుంది. 

ఫాక్ట్ (నిజం): ప్రస్తుతానికి, కోవిడ్-19 యొక్క వ్యాప్తిని వేడి వాతావరణ పరిస్థితులు ఆపివేస్తాయని చూపించడానికి ఎటువంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు. వాతావరణం వేడెక్కినప్పుడు కోవిడ్-19 యొక్క వ్యాప్తి తగ్గుతుందో లేదో తెలియదని సీడీసీ (CDC) వారు కూడా తెలిపారు. కావున, పోస్ట్ లో చెప్పింది ఇంకా ధృవీకరించబడలేదు    

వేడి వాతావరణ పరిస్థితుల వల్ల కోవిడ్-19 యొక్క వ్యాప్తి తగ్గుతుందని చెప్పడానికి ప్రస్తుత జరిగిన రీసెర్చ్ సరిపోదని,  వాతావరణం వల్ల వైరస్ వ్యాప్తి ఎలా మారుతుందో అంచనావేయడానికి తగిన సమయం కావాలని ‘నేషనల్ జియోగ్రాఫిక్’ మరియు ‘న్యూ సైంటిస్ట్’ ఆర్టికల్స్ లో చూడవొచ్చు.

వాతావరణం వేడెక్కినప్పుడు కోవిడ్-19 యొక్క వ్యాప్తి తగ్గుతుందో లేదో తెలియదని సీడీసీ (CDC) వారి వెబ్సైటులో చూడవొచ్చు (‘it is not yet known whether weather and temperature impact the spread of COVID-19. Some other viruses, like the common cold and flu, spread more during cold weather months but that does not mean it is impossible to become sick with these viruses during other months.  At this time, it is not known whether the spread of COVID-19 will decrease when the weather becomes warmer.  There is much more to learn about the transmissibility, severity, and other features associated with COVID-19 and investigations are ongoing’). అదే విషయాన్ని WHO వారి వెబ్సైటులో కూడా చూడవొచ్చు. ఈ టాపిక్ పై WHO డాక్టర్ మరియా వాన్ ఇచ్చిన సమాధానాన్ని ఇక్కడ చూడవొచ్చు.

క్లెయిమ్ 5: గోరువెచ్చటి నీరు మరియు ఉప్పుతో పుక్కులించడం వలన కోవిడ్-19 ని నివారించవచ్చు. 

ఫాక్ట్ (నిజం): గోరు వెచ్చటి నీరు మరియు ఉప్పుతో పుక్కులించడం వలన కోవిడ్-19 ని నివారించవచ్చని WHO వారు ఎక్కడా కూడా చెప్పలేదు. గోరు వెచ్చటి నీరు మరియు ఉప్పుతో పుక్కులించడం వలన కోవిడ్-19 ని నివారించవచ్చని తమ దగ్గర ఎటువంటి కచ్చితమైన సాక్ష్యాలు లేవని ‘AFP’ కి పంపించిన మెయిల్ లో WHO వారు తెలిపారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు. 

తాము రిలీజ్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదని కొరోనా వైరస్ కి సంబంధించి ఇచ్చిన ఒక ప్రత్రిక ప్రకటన లో UNICEF వారు తెలిపారు. అంతే కాదు, మెసేజ్ యొక్క ఫోటో పెట్టి , అది తప్పు అంటూ ‘UNICEF Cambodia’ వారు ట్వీట్ కూడా చేసారు.

చివరగా, కోవిడ్-19 కి సంబంధించి వైరల్ అవుతున్న మెసేజ్ ని UNICEF జారీ చేయలేదు. ఆ మెసేజ్ లోని చాలా వరకు క్లెయిమ్స్ తప్పు లేదా ధృవీకరించబడనివి.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll