Fake News, Telugu
 

GHMC లో వరద సహాయం ఆపమని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బండి సంజయ్ రాసినట్టు ఉన్న ఈ లేఖ ఫేక్.

0

GHMC లో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన, ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు GHMC పరిధిలో ప్రజలకు ఇస్తున్న వరద సహాయం (పది వేల రూపాయల సహాయం) ఆపేయమని ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే, వరద  సహాయం ఆపమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయడం వల్లనే రాష్ట్ర ఎన్నికల కమిషన్  వరద సహాయం ఆపిందని చెప్తూ, ఒక లేఖ ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: GHMC లో ప్రభుత్వం ఇస్తున్న వరద సహాయం ఆపయమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఫోటో.

ఫాక్ట్: అది ఒక ఫేక్ లెటర్. ఆ లెటర్ లో చాలా తప్పులు ఉన్నాయి. బండి సంజయ్ సంతకం కూడా వేరే లెటర్లలో తన సంతకం లాగా లేదు. ఇంకా ఈ లేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాసినట్టు ఉంది. GHMC ఎన్నికలకు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎటువంటి సంబంధం లేదు. తన పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు కూడా చేసాడు. అయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి వేరే ఏదైనా లెటర్ రాశాడా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే సోషల్ మీడియా తో వైరల్ అవుతున్న ఈ లెటర్ ఫేక్. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో పెట్టిన లేఖ ని సరిగ్గా గమనిస్తే, దాంట్లో చాలా స్పెల్లింగ్ మరియు గ్రామర్ తప్పులు ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, పోస్ట్ లోని లేఖ మరియు దాంట్లో ఉన్న బండి సంజయ్ సంతకం తన ఇతర లేఖలతో పోలుస్తే, వేరేలా ఉన్నట్టు చూడవొచ్చు.

అంతే కాదు, ఈ లేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాసినట్టు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకి, కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఎటువంటి సంబంధం లేదు. స్థానిక సంస్థల అన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంబంధం లేని సంస్థకు లేఖ రాసె అవకాశం తక్కువ.

ప్రెస్ కాన్ఫరెన్స్ లో పోస్ట్ లోని లేఖ గురించి మీడియా వారు తనని అడగగా, అది ఒక ఫేక్ లేఖ అని, తను అలాంటి లేఖ అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాయలేదని బండి సంజయ్ తెలిపాడు. అంతేకాదు, ‘లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తారా…?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసాడు. తన పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు కూడా చేసాడు.

అయితే, వరద సహాయం ఆపేయమని చెప్పడానికి గల కారణాలు మరియు తమకు ఈ విషయం పై ఎవరి నుండి అయినా లేఖలు వచ్చాయా అనే వివరాలు కోరుతూ ఈ-మెయిల్ ద్వారా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను FACTLY సంప్రదించింది. వారిని నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, GHMC లో వరద సహాయం ఆపమని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బండి సంజయ్ రాసినట్టు ఉన్నది ఫేక్ లేఖ.

Share.

About Author

Comments are closed.

scroll