దేశంలో ఉన్న సుమారు వంద మంది దేశ వ్యతిరేకులను జైల్లో పెడితే CAA మరియు NRC వ్యతిరేక ఉద్యమాలు జరుగవని కాంగ్రెస్ MLA అనిల్ ఉపాధ్యాయ అంటున్న దృశ్యాలు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ MLA అనిల్ ఉపాధ్యాయ CAA మరియు NRC ఉద్యమాలు చేసిన వ్యక్తులని జైల్లో పెట్టాలని మీడియాకి చెప్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): అనిల్ ఉపాధ్యాయ అనే పేరు గల MLA, కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. ఇదివరకు అనిల్ ఉపాధ్యాయ అనే ఇదే పేరు గల వ్యక్తి బిజేపి పార్టీకి చెందిన MLA అని తప్పుగా పోస్టులు పెట్టారు. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించి కొన్ని కీ పదాలతో గూగుల్ లో వెతికితే, ఇదే వీడియో ‘The News Paper’ అనే యూట్యూబ్ ఛానెల్లో దొరికింది. ఈ వీడియోని ’04 మార్చ్ 2020’ నాడు పోస్ట్ చేసారు. వీడియో మాట్లాడుతున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ MLA అని వీడియో వివరణలో ఎక్కడ తెలుపలేదు.
అనిల్ ఉపాధ్యాయ అనే పేరు గల కాంగ్రెస్ MLA అభ్యర్ధి కోసం ‘My Neta’ వెబ్సైటులో వెతికితే, ఆ పేరు గల MLA కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరని తెలిసింది. అనిల్ ఉపాధ్యాయ అనే పేరుతో ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, వారు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కాదని తెలిసింది.
ఇదివరకు, అనిల్ ఉపాధ్యాయ అనే ఇదే పేరు గల వ్యక్తి బిజేపి పార్టీకి MLA అని షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, సంబంధం లేని వ్యక్తి వీడియోని చూపిస్తూ కాంగ్రెస్ MLA అనిల్ ఉపాధ్యాయ CAA, NRC కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే వ్యక్తులని జైల్లో వెయ్యమని చెప్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు.