Coronavirus Telugu, Fake News, Telugu
 

ఢిల్లీలో సర్దార్ పటేల్ కోవిడ్ సెంటర్ నిర్మాణంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలువురు ముఖ్య భూమిక పోషించారు

0

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్మించిన ప్రపంచంలోనే  అతి పెద్ద 10000- పడకల సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ కు సంబంధించి  సోషల్ మీడియాలో అనేక మంది వివిధ పార్టీలకు క్రెడిట్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంత మంది ఆ కోవిడ్ సెంటర్ నిర్మించింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ITBP (ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్) అంటూ, ఇంకొందరు అది నిర్మించింది ఢిల్లీ ప్రభుత్వం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ 1: 10000- పడకల సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ఢిల్లీ లో నిర్మించింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ITBP.

క్లెయిమ్ 2: 10000- పడకల సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మించింది ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అరవింద్ కేజ్రివాల్.

ఫాక్ట్ (నిజం): సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలువురు ముఖ్య భూమిక పోషించారు. కేంద్ర ఆధీనంలోని నోడల్ ఏజెన్సీ ITBP వెయ్యి మంది (1000) డాక్టర్లని, పారామెడికల్ సిబ్బందిని మరియు నర్సులని సమకూర్చింది. తాగు నీరు మరియు పరిశుధ్యానికి సంబంధించిన పనులు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంది. కోవిడ్ సెంటర్ కోసం కావలిసిన స్థలాన్ని, మౌలిక నిర్మాణానికి సంబంధించిన పనులని మరియు ఆహారం ‘Radha Soami Satsang Beas Centre’ సంస్థ సమకూరుస్తుంది. ‘Sleepwell Mattress Company’ పరుపులు, భారతీయ రైల్వే దుప్పట్లు మరియు పిల్లో కవర్లు అందించడం జరిగింది. కావున, సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మించడంలో చాలా మంది ముఖ్య భూమిక పోషించారు. అందుకే సోషల్ మీడియా లో ఒక్కరికే క్రెడిట్ ఇస్తూ పెడుతున్న పోస్టులు తప్పు దోవ పట్టించేలా ఉన్నాయి.

సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన వివరాల కోసం వెతకగా, సౌత్ ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ (District Magistrate South Delhi) ఈ కోవిడ్ సెంటర్ కి సంబంధించి పెట్టిన ఒక ట్వీట్ దొరికింది. ఆ ట్వీట్లో, 10000 పడకలలో 2000 పడకలు కోవిడ్ సెంటర్ లో సిద్దంగా ఉన్నాయని, ఈ నిర్మాణానికి సహకరించిన ITBP కి , Radha Soami Satsang Beas Centre సంస్థకి ధన్యవాదాలు తెలిపారు. ‘ANI’ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ బి ఎం మిశ్రా, Radha Soami Satsang Beas Centre లో నిర్మించిన 10000 పడకల కోవిడ్ సెంటర్ లో 10 శాతం ఆక్సిజనేటడ్ చేయబడినవి అని, వాటి ఎయిర్ కండిషనింగ్ సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు.

రాఘవ్ చద్దా (AAP MLA and Vice-Chairman -Delhi Jal Board) తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన ట్వీట్లో, సర్దార్ పటేల్ కోవిడ్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మరియు Radha Soami Satsang Beas Centre కలిసి సాధించిన ఘనత అని పేర్కొన్నారు. ‘ABP News’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవ్ చద్దా, కేంద్ర ప్రభుత్వంతో తాము కలిసి చేసిన పెద్ద ప్రాజెక్ట్ ఇది అని పేర్కొన్నారు. అలాగే, ఈ కోవిడ్ సెంటర్ కు నిరంతరంగా మంచి నీరు వచ్చేలా ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుంది, అని తెలుపుతూ ట్వీట్ కూడా పెట్టారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రివాల్ కూడా 10000-పడకల సర్దార్ పటేల్ కోవిడ్ సెంటర్ నిర్మాణానికి, కేంద్ర ప్రభుత్వంతో సహా పలువురు ముఖ్యభూమిక పోషించారు అని చెప్తూ ట్వీట్ పెట్టారు.

DD News వారు తమ వెబ్సైటులో రాసిన ఒక ఆర్టికల్ లో, సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మాణానికి కేంద్ర ఆధీనంలోని ITBP (ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్) వెయ్యి మంది (1000) డాక్టర్లని, పారామెడికల్ సిబ్బందిని, మరియు నర్సులని సమకూర్చింది అని తెలిపారు. తాగు నీరు మరియు పారిశుధ్యానికి సంబంధించిన పనులు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని, కోవిడ్ సెంటర్ కోసం కావలిసిన స్థలాన్ని, మౌలిక నిర్మాణానికి సంబంధించిన పనులు మరియు ఆహరం Radha Soami Satsang Beas Centre సంస్థ  వారు సమకూరుస్తున్నారని ఆ ఆర్టికల్ లో రాయడం జరిగింది. బిజేపి M.P మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సర్దార్ పటేల్ కోవిడ్ సెంటర్ కి సంబంధించి భారతీయ రైల్వే 30000 దుప్పట్లు, పిల్లో కవర్లు సమకూర్చింది అని, ‘Sleepwell Mattress Company’ కోవిడ్ సెంటర్ కి కావలిసిన పరుపులు సమకూర్చింది అని తెలిపారు. కావున, ఈ కోవిడ్ సెంటర్ నిర్మాణంలో పలువురు ముఖ్య భూమిక పోషించారు. ఏ ఒక్కరికో ఈ నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ ఇవ్వడం సరికాదు.

చివరగా, 10000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ సెంటర్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ముఖ్యభూమిక పోషించారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll